Veera Simha Reddy: ఆ పాత్రే వీరసింహారెడ్డికి హైలెట్ కానుందా?

స్టార్ హీరో బాలకృష్ణ నటిస్తున్న వీరసింహారెడ్డి మూవీ ఒక పాట మినహా షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ఈ నెల 18వ తేదీ నుంచి ఈ పాట షూట్ జరగనుందని ఐదు రోజుల్లో ఈ పాట షూట్ పూర్తి కానుందని సమాచారం. ఈ సినిమా రీరికార్డింగ్ పనులు మొదలుకాలేదని తెలుస్తోంది. థమన్ త్వరలో ఈ సినిమా రీ రికార్డింగ్ ను మొదలుపెట్టనున్నారు. సంక్రాంతికి విడుదలవుతున్న వారసుడు సినిమాకు కూడా థమన్ మ్యూజిక్ డైరెక్టర్ అనే సంగతి తెలిసిందే.

అయితే వీరసింహారెడ్డి సినిమాలో శృతి హాసన్ మెయిన్ హీరోయిన్ అయినా ఆమె పాత్ర గురించి ఎలాంటి విషయాలు రివీల్ అవ్వడం లేదు. అయితే శృతి హాసన్ పాత్ర సినిమాకు హైలెట్ కానుందని ఆమె పాత్ర ఎన్నో ట్విస్ట్ లతో ముడిపడి ఉంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. శృతి హాసన్ పాత్ర సినిమాకు హైలెట్ కానుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. శృతి హాసన్ గతంలో ఈ సినిమాలో తన రోల్ స్పెషల్ గా ఉంటుందని అన్నారు.

ఈ సినిమాలో తాను గమ్మత్తైన పాత్రలో కనిపించనున్నానని ఆమె క్లారిటీ ఇచ్చారు. ఈ నెల మూడో వారం నుంచి ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలుకానున్నాయి. బాలయ్య ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతారని చెప్పడంలో సందేహం అవసరం లేదని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. సంక్రాంతి సినిమాలకు గట్టి పోటీ ఇస్తానని బాలయ్య కాన్ఫిడెన్స్ తో ఉన్నారని సమాచారం.

వీరసింహారెడ్డి శాటిలైట్, డిజిటల్ హక్కులు భారీ మొత్తానికి అమ్ముడయ్యాయని తెలుస్తోంది. అఖండ సినిమా ఆలస్యంగా ఓటీటీలో స్ట్రీమింగ్ కాగా వీరసింహారెడ్డి విషయంలో కూడా అదే విధంగా జరుగుతుందేమో చూడాల్సి ఉంది. బాలయ్య పాన్ ఇండియా సినిమాలపై దృష్టి పెట్టాలని ఫ్యాన్స్ కోరుకుంటుండగా ఫ్యాన్స్ కోరిక ఎప్పటికి నెరవేరుతుందో చూడాల్సి ఉంది.

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus