Shruti Haasan: ఇప్పుడు ఎంతో ప్రశాంతంగా ఉన్నాను.. శృతిహాసన్ కామెంట్స్ వైరల్!

కమల్ హాసన్ కుమార్తెగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినటువంటి శృతిహాసన్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. కెరియర్ మొదట్లో ఐరన్ లెగ్ అనే ట్రోల్స్ ఎదుర్కొన్నటువంటి ఈమె ప్రస్తుతం మాత్రం ఇండస్ట్రీలో పలు భాష చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇలా కెరియర్ పరంగా వరుస సినిమాలలో నటిస్తున్న సమయంలో ఈమె ఒక వ్యక్తితో ప్రేమలో పడి పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు అయితే కొన్ని కారణాలవల్ల వారిద్దరికీ బ్రేకప్ జరిగింది ఆ సమయంలో ఈమె మానసికంగా చాలా కృంగిపోయి సినిమా ఇండస్ట్రీకి కూడా దూరమయ్యారు.

ఇలా సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నటువంటి శృతిహాసన్ అనంతరం రవితేజ హీరోగా నటించిన క్రాక్ సినిమా ద్వారా తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ కావడంతో ఈమెకు వరుసగా సినిమా అవకాశాలు వస్తున్నాయి. త్వరలోనే ప్రభాస్ హీరోగా నటించిన సలార్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఇదిలా ఉండగా ఈమె ప్రస్తుతం శంతను అనే వ్యక్తితో రిలేషన్ లో ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఇలా వ్యక్తితో సహజీవనం చేస్తున్నటువంటి శృతిహాసన్ కు తరచూ నెటిజెన్స్ నుంచి పెళ్లి గురించి ప్రశ్నలు ఎదురవుతుంటాయి.

ఇలా తరచూ ఈమె పెళ్లి గురించి ప్రశ్నలు ఎదురవడంతో తాజాగా పెళ్లి గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం నాలుగు పదుల వయసులోకి అడుగుపెడుతున్నటువంటి శృతిహాసన్ ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా ఉన్నారు. అయితే ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ తరచూ చాలామంది నాకు 30 సంవత్సరాల వయసు దాటిందని ఇంకా పెళ్లి కాలేదు అంటూ నాకు గుర్తు చేస్తూ ఉండేవారు అయితే ఇలా పెళ్లి గురించి ఆలోచన వచ్చిన ప్రతిసారి తాను ఎంతో ఒత్తిడికి గురయ్యే దానిననీ ఈమె తెలియజేశారు.

30 సంవత్సరాలు దాటితే తప్పనిసరిగా పెళ్లి చేసుకోవాలా లేకపోతే అదొక నేరమా అంటూ ఈమె ప్రశ్నించారు. 30 సంవత్సరాలు దాటిన తర్వాత పెళ్లి చేసుకోకపోతే దేశ ఆర్థిక వ్యవస్థ ఏమైనా కృంగిపోతుందా అంటూ కూడా ఈమె ప్రశ్నించారు. పెళ్లి గురించి పలు విమర్శలు చేసినప్పటికీ వాటి గురించి ఆలోచించి తాను బాధపడకూడదని నిర్ణయం తీసుకున్నాను అందుకే నా గురించి నా పెళ్లి గురించి ఎన్ని విమర్శలు వచ్చినా నేను ఆలోచించడం లేదని ఇలా ఆలోచించకపోవడం వల్లే నా మనసు ఎంతో ప్రశాంతంగా ఉంది అంటూ ఈ సందర్భంగా (Shruti Haasan) శృతిహాసన్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!

‘సైందవ్’ తో పాటు టాలీవుడ్లో వచ్చిన ఫాదర్-డాటర్ సెంటిమెంట్ మూవీస్ లిస్ట్..!
ఆ హీరోయిన్స్ చేతిలో ఒక సినిమా కూడా లేదంట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus