Shruti Haasan: వైరల్ అవుతున్న హీరోయిన్ శృతి హాసన్ షాకింగ్ కామెంట్స్!

టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్లలో ఒకరైన శృతి హాసన్ కు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ అంతాఇంతా కాదు. సలార్ సినిమాతో మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న శృతి హాసన్ ఈ సినిమాతో మరో సక్సెస్ ను అందుకుంటానని నమ్ముతున్నారు. అయితే తాజాగా ఈ బ్యూటీ మరోమారు రెమ్యునరేషన్ గురించి సంచలన వ్యాఖ్యలు చేయడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. 76 కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో శృతి మాట్లాడుతూ హీరోలకు సమానంగా రెమ్యునరేషన్ ను తీసుకోవడానికి రెండు దశాబ్దాల సమయం పట్టిందని ప్రియాంక చోప్రా చెప్పిందని అన్నారు.

ఈ విషయానికి సంబంధించి ప్రియాంక చోప్రా అద్భుతం సాధించారని మేము మాత్రం ఇంకా కష్టపడుతున్నామని శృతి హాసన్ అన్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో సమాన వేతనం గురించి చర్చలు కూడా లేవని ఆమె చెప్పుకొచ్చారు. హీరోలతో పాటు హీరోయిన్లకు కూడా సమానంగా రెమ్యునరేషన్ ఇచ్చే రోజు కోసం ఎదురుచూస్తున్నామని శృతి వెల్లడించారు. కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో శృతి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

అయితే శృతి కామెంట్లపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. డిమాండ్ కు అనుగుణంగా హీరోయిన్లకు రెమ్యునరేషన్ ఇస్తారని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. టాలెంట్ ఉంటే హీరోయిన్లు ఎక్కువ మొత్తం పారితోషికం తీసుకోవడం కష్టం కాదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. శృతి హాసన్ ఈ తరహా కామెంట్లు చేయడం వల్ల అనవసర వివాదాలలో చిక్కుకోవడం మినహా ప్రయోజనం ఉండదని చెప్పవచ్చు.

శృతి హాసన్ (Shruti Haasan) రెమ్యునరేషన్ ప్రస్తుతం 3 కోట్ల రూపాయలకు అటూఇటుగా ఉంది. రాబోయే రోజుల్లో శృతి పారితోషికం మరింత పెరిగే ఛాన్స్ అయితే ఉంది. సలార్ మూవీలో శృతి హాసన్ నటిస్తున్న పాత్రకు సంబంధించి అధికారికంగా ఎలాంటి అప్ డేట్స్ రాలేదు. విభిన్నమైన పాత్రలకు శృతి హాసన్ ఓటేస్తుండటం గమనార్హం.

బిచ్చగాడు 2 సినిమా రివ్యూ & రేటింగ్!
డెడ్ పిక్సల్స్ వెబ్ రివ్యూ & రేటింగ్!

అన్నీ మంచి శకునములే సినిమా రివ్యూ & రేటింగ్!
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus