మల్టీ ట్యాలెంటెడ్ గర్ల్ శృతి హాసన్ విజయాలతో పాటు, వివాదాలను వెంట వేసుకొని వెళుతోంది. మీడియా ఏమి రాసిన పట్టించుకోనని గతంలో తాను చెప్పినట్లు ప్రవర్తిస్తోంది. లండన్‌కు చెందిన థియేటర్ ఆర్టిస్టు మైఖేల్ కోర్సెలే తో సహజీవనం చేస్తున్నట్లు అనేక సార్లు ముంబై పత్రికలు కథనాలు ప్రచురించాయి. గతంలో ముంబై ఎయిర్‌పోర్టులో ప్రియుడితో కలిసి మీడియా కంటపడింది. అయినా ప్రేమలో ఉన్నట్లు ఒప్పుకోలేదు. తాజాగా ఆమె చేసిన పని చూస్తే ఎవరికైనా శృతి, మైఖేల్ మధ్య బలమైన బంధం ఉందని స్పష్టం అవుతోంది.
మొన్న లండన్ నుంచి ముంబై వచ్చిన మైఖేల్‌ను చూసి ఆనందంతో శృతి ఆగలేకపోయింది. కెమెరా కళ్ళు తనని చూస్తున్నాయనే సంగతిని పక్కన పెట్టి, ఎయిర్‌పోర్టులో అందరూ చూస్తుండగానే మైఖేల్ వాహనంలోకి వెళ్ళింది. వెంటనే కౌగిలించుకుంది. మైఖేల్ కూడా శృతిని గట్టిగా కౌగిలిలో బంధించాడు. వారి ప్రేమకు చిహ్నంగా నిలిచిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మరి దీనికి శృతి హాసన్ యేమని వివరణ ఇచ్చుకుంటుందో చూడాలి.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.