Shruti Haasan: నటనకు వయసుతో సంబంధం లేదు… నంబర్ మాత్రమే: శృతిహాసన్

కమల్ హాసన్ కుమార్తెగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శృతిహాసన్ వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.అయితే కెరీర్ మొదట్లో ఈమె నటించిన సినిమాలన్నీ కూడా ఫ్లాప్ కావడంతో ఈమెపై ఐరన్ లెగ్ అనే ముద్ర ఉంది అయితే తన నటనతో తనని తాను నిరూపించుకొని ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగిన శృతిహాసన్ అనంతరం కొన్ని కారణాలవల్ల కొంతకాలం పాటు ఇండస్ట్రీకి దూరమయ్యారు.

ఈ విధంగా ఇండస్ట్రీకి విరామం ప్రకటించిన శృతిహాసన్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ హీరోగా నటించిన క్రాక్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో ఈమెకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో వరుస అవకాశాలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రస్తుతం శృతిహాసన్ చిరంజీవి బాలకృష్ణ సినిమాలలో నటించారు.

ఈ విధంగా బాలకృష్ణ సరసన వీరసింహారెడ్డి చిరంజీవి సరసన వాల్తేరు వీరయ్య సినిమాలలో శృతిహాసన్ నటించిన సందడి చేశారు. ఇలా సీనియర్ హీరోలతో ఈమె నటించడంతో తండ్రి వయసు ఉన్న వారితో నటించడం పట్ల చాలామంది ఈమెను ఈ విషయంలో ట్రోల్ చేశారు.అయితే తాజాగా ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న శృతిహాసన్ తనని ట్రోల్ చేస్తున్న వారికి తనదైన స్టైల్ లో సమాధానం చెప్పారు.

ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ… సినిమా ఇండస్ట్రీలో నటించాలంటే అందుకు వయసుతో ఏమాత్రం సంబంధం లేదని మనలో ప్రతిభ, టాలెంట్ ఉంటే మరణించేవరకు నటించవచ్చని సమాధానం చెప్పారు. ఇదివరకు ఎంతోమంది హీరోలు తమకన్నా వయసులో సగం తక్కువ వయసు ఉన్న హీరోయిన్లతో నటించారు. అందుకు తానేమి అతీతం కాదని ఈ సందర్భంగా శృతిహాసన్ ట్రోలర్స్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. దీంతో ఈమె చేసినటువంటి ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

బటర్ ఫ్లై సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో అలరించిన తెలుగు సినిమాలు ఇవే!

ఇప్పటవరకూ ఎవరు చూడని శ్రీలీల రేర్ ఫోటో గ్యాలరీ!!
‘ఖుషి’ పవన్ ఫ్యాన్స్ కు ఒక డ్రగ్ లాంటిది..రీ రిలీజ్ లో ఎందుకు చూడాలి అంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus