శృతిహాసన్ బాధ పడుతున్న వ్యాధి గురించి తెలుసా..?

టాలీవుడ్ స్టార్ హీరోలు, స్టార్ హీరోయిన్లు పైకి ఎంతో సంతోషంగా కనిపిస్తూ ఉంటారు. కానీ కొంతమంది హీరోహీరోయిన్లు వేర్వేరు ఆరోగ్య సమస్యలతో బాధ పడుతూ ఉంటారు. ఆయా హీరోహీరోయిన్లు నోరు విప్పి చెబితే మాత్రమే వారి ఆరోగ్య సమస్యల గురించి తెలిసే అవకాశం ఉంటుంది. తాజాగా ప్రముఖ నటి శృతిహాసన్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను యాంక్జైటీ అనే మానసిక సమస్యతో బాధ పడుతున్నానని వెల్లడించారు. తండ్రి నట వారసత్వాన్ని కొనసాగిస్తూ టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన శృతిహాసన్ హిట్ ఫ్లాపులకు అతీతంగా కెరీర్ లో అవకాశాలను అందిపుచ్చుకున్నారు.

స్టార్ హీరోల సరసన వరుస ఆఫర్లతో సత్తా చాటుతున్న శృతిహాసన్ చిన్నతనం నుంచి తాను యాంక్జైటీ డిజార్డర్ తో బాధ పడుతున్నానని చెప్పుకొచ్చారు. ఈ డిజార్డర్ తో బాధ పడుతున్నానని అర్థం చేసుకోవడానికి తనకు చాలా సమయం పట్టిందని ఆమె అన్నారు. కొందరికి యాంక్జైటీ డిజార్డర్ పెద్ద సమస్య కాకపోయినా తనకు ఈ సమస్య పెద్ద సమస్యే అని.. మీరు పడే బాధ ఇతరులకు బాధాకరమైనది కాకపోవచ్చంటూ శృతి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

వేదికపై మాట్లాడటం, వేదికపైకి రావడం విషయంలో తాను భయపడేదానినని.. తాను ఈ సమస్యతో బాధ పడుతున్నానని 30 సంవత్సరాల వయస్సు వచ్చిన తర్వాత గుర్తించానని ఆమె అన్నారు. టాక్ థెరపీ యాంక్జైటీ డిజార్డర్ నుంచి బయటపడటంలో సహాయపడుతుందని శృతి అన్నారు. శృతి వింత ఆరోగ్య సమస్య గురించి తెలిసి ఆమె అభిమానులు షాకవుతున్నారు. ఈ ఏడాది క్రాక్ తో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకున్న శృతిహాసన్ ప్రస్తుతం వకీల్ సాబ్, సలార్ సినిమాలలో నటిస్తున్నారు.

Most Recommended Video

శ్రీకారం సినిమా రివ్యూ & రేటింగ్!
జాతి రత్నాలు సినిమా రివ్యూ & రేటింగ్!
గాలి సంపత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus