తనకు కాబోయే భర్తలో ఎలాంటి లక్షణాలుండాలో చెప్పిన శ్రుతిహాసన్‌!

  • October 1, 2017 / 10:07 AM IST

‘మీకు కాబోయే భర్తలో ఎలాంటి లక్షణాలుండాలి?’ అనే ప్రశ్న దాదాపుగా ప్రతి ఒక్క హీరోయిన్ కి ఎదురవుతూనే ఉంటుంది. దానికి వాళ్ళు ‘మంచివాడు, తెలివైన వాడు, సంస్కారవంతుడు…’ అంటూ మంచి లక్షణాలన్నీ ఉన్న ఓ అబ్బాయి కావాలంటూ పెద్ద చిట్టా విప్పేస్తుంటారు మన హీరోయిన్స్. అయితే శ్రుతిహాసన్‌ కాస్త భిన్నమైన సమాధానం ఇచ్చింది. ‘‘అందరిలానే నేనూ నిజాయతీపరుడైన మగాడే భర్తగా కావాలి అని కోరుకుంటున్న. కానీ మరీ బుద్ధిమంతుణ్నీ భరించలేం. కాస్త అల్లరీ చేయాలి. జీవితాన్ని ఆస్వాదించడంలో ముందుండాలి’’ అంటోంది శ్రుతి.

అయితే కాబోయే భర్తకు తప్పని సరిగా గెడ్డం ఉండాలట. ‘‘క్లీన్‌ షేవ్‌తో ఉన్న మగాళ్లని నేను పెద్దగా ఇష్టపడను. గెడ్డం ఉంటే రఫ్‌గా, మాన్లీగా కనిపిస్తారు. అయితే ఇవన్నీ బాహ్య సౌందర్యాలే. నేను అంతః సౌందర్యాన్నీ అంచనా వేయగలను. మనస్సాక్షికి విరుద్ధంగా ప్రవర్తించే వ్యక్తులకు దూరంగా ఉంటా’’అని చెప్పింది శ్రుతి. ఇటు తెలుగులో, అటు తమిళంలో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతూ ఇలా సడెన్‌గా సైడైపోయిన హీరోయిన్లు అరుదు. హిందీలో నటించిన ‘బెహెన్ హోగి తేరి’ కూడా బోల్తా కొట్టడంతో శ్రుతి కెరీర్ బాగా ఇబ్బందుల్లో పడిపోయింది. ఇప్పుడు ఆమె చేతిలో ఒక్కటంటే ఒక్క సినిమా లేదు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus