పవన్ పక్కన మరోసారి శృతి హాసన్

  • May 16, 2016 / 10:29 AM IST

సర్దార్ గబ్బర్ సింగ్ దెబ్బ పవన్ కళ్యాణ్ కి విక్టరీ మత్తును దించినట్లు ఉంది. కొన్ని సెంటిమెంట్లను ఫాలో అవ్వాలని డిసైడ్ అయ్యారు. ఎన్నో ఏళ్ళ తర్వాత గబ్బర్ సింగ్ తో హిట్ సాధించిన పవన్ అటువంటి హిట్ మళ్లీ కొట్టేందుకు ప్లాన్ వేస్తున్నారు. అందులో భాగంగానే తన లక్కీ హీరోయిన్ శృతి హాసన్ ను ఎంపిక చేశారు.

నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ ద్వార శరత్ మరార్ పవన్ తో కొత్త సినిమా తీస్తున్నారు. దీనికి డైరెక్టర్ ఎస్ జె సూర్య, కథ, మాటలు ఆకుల శివ. ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఇందులో హీరోయిన్ గా శృతి హాసన్ ను ఫైనల్ చేసినట్లు చిత్ర యూనిట్ ఖరారు చేసింది. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా షూటింగ్ వచ్చే నెల నుంచి మొదలు కానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus