సూపర్ యాక్టివ్ గర్ల్ శృతి హాసన్ నటిగా, గాయనిగా, సాంగ్ కంపోజర్ గా దూసుకుపోతోంది. విశ్వ నటుడు కమల్ హాసన్ కూతురిగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఈ భామ తన కంటూ ఓ గుర్తింపును సొంతం చేసుకుంది. తెలుగులో గబ్బర్ సింగ్ తో హిట్ ట్రాక్ లోకి వచ్చిన శృతి ఎవడు, రేసుగుర్రం, శ్రీమంతుడు తో హ్యాట్రిక్ హిట్ అందుకుంది.
ప్రస్తుతం తండ్రి కమల్ హాసన్ తో కలిసి శబాష్ నాయుడు చిత్రంలో నటిస్తోంది. సినిమాలో కూడా వీరిద్దరూ తండ్రి కూతుళ్ల గానే కనిపించనున్నారు. అంతేకాదు హిందీలో, తమిళంలో ఒక్కో చిత్రం శృతి చేస్తోంది. తెలుగులో నాగ చైతన్య పక్కన ప్రేమమ్ మూవీలో నటిస్తోంది. సెట్ లో చలాకీగా ఉన్న ఆమెను “ఇంత బిజీ షెడ్యూల్ లోను మీరు ఇంత యాక్టివ్ గా ఎలా ఉంటారు” అని ప్రశ్నిస్తే.. “నాకు కెమెరా ముందు నటించి ఓ పక్కన సైలంట్ గా కూర్చోవడం ఇష్టముండదు.
ఏదో ఒకటి నేర్చుకోవాలనే తపన ఉంటుంది. అందుకే సెట్ పరిసరాలను, అక్కడి మనుషులను పరిశీలిస్తుంటాను. ఇంట్రస్టింగ్ గా అనిపించిన వాటి గురించి అడిగి తెలుసుకుంటా. షూటింగ్ అయిపోయి ఇంటికి వెళ్ళగానే ఈ రోజు కొత్త విషయం ఏమి నేర్చుకున్నాను అని నాకు నేనే ప్రశ్నించుకుంటాను. ఇలా ఉంటేనే ఎన్నో నేర్చుకుంటాం.” అని చెప్పింది. చైతూ సినిమా పూర్తి కాగానే శృతి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో మరో సారి జోడి కట్టనుంది.