Shruti Haasan: ఆ విషయంలో శృతిహాసన్ మారినట్టేనా?

స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కొన్నేళ్ల క్రితం రవితేజ మినహా యంగ్ జనరేషన్ స్టార్ హీరోలకు మాత్రమే జోడీగా నటించారు. అయితే అవకాశాలు తగ్గిన తర్వాత కాజల్ సీనియర్ హీరోలకు జోడీగా నటించడానికి ఓకే చెప్పడంతో పాటు ఖైదీ నంబర్ 150 సినిమాలో చిరంజీవికి జోడీగా నటించారు. స్టార్ హీరోయిన్ శృతిహాసన్ కూడా ప్రస్తుతం కాజల్, తమన్నా బాటలోనే నడుస్తుండటం గమనార్హం. సీనియర్ హీరోలకు జోడీగా నటించడానికి శృతి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

బాలకృష్ణ గోపీచంద్ మలినేని కాంబినేషన్ సినిమాకు శృతిహాసన్ హీరోయిన్ గా ఎంపికయ్యారు. ఇప్పటివరకు తన తండ్రి తరం హీరోలకు జోడీగా నటించడానికి శృతి ఆసక్తి చూపలేదు. అయితే ఈ నిబంధనను పక్కన పెట్టి గోపీచంద్ మలినేని శృతితో రెండు హిట్ సినిమాలను తెరకెక్కించిన నేపథ్యంలో శృతి గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో మరోసారి నటించడానికి ఓకే చెప్పారు. ఒకవైపు ప్రభాస్ సినిమాలో నటిస్తూనే మరోవైపు బాలయ్య సినిమాలో శృతి నటిస్తుండటం గమనార్హం.

కాటమరాయుడు తర్వాత కొంతకాలం గ్యాప్ తీసుకున్న శృతిహాసన్ రీఎంట్రీలో వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. జనవరి నుంచి బాలయ్య గోపీచంద్ మలినేని కాంబో మూవీ రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. ఈ సినిమాకు జై బాలయ్య అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారని సమాచారం. భారీ బడ్జెట్ తో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సీనియర్ హీరోల విషయంలో శృతి నిర్ణయం మారినట్టేనని తెలుస్తోంది.

పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus