ఇంతకుమునుపు హీరోయిన్ల అందాలను ఆస్వాదించాలంటే థియేటర్లు మాత్రమే దిక్కు. ఆ తర్వాత పోస్టర్లు మీద బొమ్మలు చూసి సంతృప్తిపడేవారు జనాలు. ఈ డిజిటల్ యుగం మొదలయ్యాక ట్రైలర్, ప్రోమోస్, టీజర్స్ అంటూ ఆన్ లైన్ లో అందాల భామల సొగసులు చూసి సంతుష్టులవుతున్నారు అభిమానులు. అయితే.. ఈమధ్యకాలంలో హీరోయిన్లు సినిమాల్లో కంటే మ్యాగజైన్ ఫోటోషూట్స్ లోనే హాట్ గా దర్శనమిస్తున్నారు. అప్పట్లో శ్రుతిహాసన్ చేసిన “మాగ్జిమ్ షూట్” మత్తులోను నుంచి బయటపడడానికి కుర్రాళ్ళకి రెండు నెలలు పట్టింది. ఇప్పుడు మళ్ళీ అదే తరహాలో శృతిహాసన్ ఓ ఫొటో షూట్ లో పాల్గొంది.
ఇండియాలో ఫేమస్ లగ్జరీ ఫ్యాషన్ వెబ్ సైట్ “పెరినా” కోసం శృతి ఫొటోలకు ఫోజిచ్చింది. ఈ ఫొటోలు బయటకు రావడంతో శృతిని చూసి అందరూ షాక్ అవుతున్నారు. ఆమె చూడడానికి ఎంతో అందంగా కనిపిస్తోంది. పెళ్లికూతురు గెటప్ లో మెరూన్ కలర్ డ్రెస్ లో అదిరిపోయేలా ఉంది. కానీ శృతి బరువు పెరిగి కనిపించడంతో అందరూ అవాక్కవుతున్నారు. ప్రస్తుతం అమ్మడి చేతిలో పెద్ద సినిమాలు ఏవీ లేవు. బాలీవుడ్ లో ఒక సినిమా, తన తండ్రి మొదలుపెట్టిన “శభాష్ నాయుడు” మినహా మరో ప్రొజెక్ట్ ఏమీ లేదు.