Shruti Hassan: శృతిహాసన్ నటిస్తే బొమ్మ బ్లాక్ బస్టర్.. సెంటిమెంట్ ప్రూవ్ అయిందా?

2023 సంవత్సరంలో శృతి హాసన్ నటించిన నాలుగు సినిమాలు థియేటర్లలో విడుదల కాగా ఈ నాలుగు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలవడం శృతి ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగిస్తోంది. నాలుగు సినిమాల్లో శృతి పాత్రలకు పెద్దగా ప్రాధాన్యత లేకపోయినా శృతి నటిస్తే బొమ్మ బ్లాక్ బస్టర్ అని మరోసారి ప్రూవ్ అయింది. ఈ ఏడాది శృతి హాసన్ వీరసింహారెడ్డి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. వీరసింహారెడ్డి మూవీ ఫుల్ రన్ లో 75 కోట్ల రూపాయలకు పైగా షేర్ కలెక్షన్లను సాధించింది.

ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా నటించారు. వీరసింహారెడ్డి విడుదలైన మరుసటి రోజున వాల్తేరు వీరయ్య రిలీజ్ కాగా ఈ సినిమా 200 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకోవడం గమనార్హం. ఆ తర్వాత కొంతకాలం గ్యాప్ ఇచ్చిన శృతి డిసెంబర్ లో హాయ్ నాన్న సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. హాయ్ నాన్న సినిమాలో ఏ మాత్రం ప్రాధాన్యత లేని పాత్రలో శృతి నటించినా ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద హిట్ గా నిలిచింది.

శృతి నటించిన సలార్ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద పెద్ద హిట్ గా నిలిచి ఫ్యాన్స్ కు ఎంతగానో సంతోషాన్ని కలిగించింది. ఆద్య పాత్రకు శృతి హాసన్ పూర్తిస్థాయిలో న్యాయం చేశారు. శృతి హాసన్ టాలీవుడ్ ఇండస్ట్రీలోని గోల్డెన్ లెగ్ హీరోయిన్లలో ఒకరిగా నిలిచిపోయారు. శృతి హాసన్ కెరీర్ పరంగా మరింత బిజీ అయ్యే ఛాన్స్ అయితే ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

శృతి హాసన్ 2024 సంవత్సరంలో సైతం వరుస విజయాలతో కెరీర్ ను కొనసాగించాలని అభిమానులు ఫీలవుతున్నారు. రాబోయే రోజుల్లో శృతి హాసన్ మరిన్ని బ్లాక్ బస్టర్ హిట్లను ఖాతాలో వేసుకోవాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. శృతిని (Shruti Hassan) అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.

సలార్ సినిమా రివ్యూ & రేటింగ్!

డంకీ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిల్లా- రంగా’ టు ‘సలార్’… ఫ్రెండ్షిప్ బ్యాక్ డ్రాప్లో రూపొందిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus