ప్రియుడిని విడిచి ఉండలేక కవిత్వం రాసిన శృతి హాసన్

ఆడవారి మాటలకూ అర్ధాలు వేరులే.. అని చెబుతుంటారు. కానీ కొంతమంది తీరు చూస్తుంటే సెలబ్రిటీల మాటలకూ అర్ధాలు వేరులే అనాల్సి వస్తుంటుంది. విశ్వనటుడు కమల్ హాసన్ పెద్ద కుమార్తె శృతిహాసన్.. లండన్‌కి చెందిన నటుడు మైఖేల్‌ కోర్సేల్‌తో కొంతకాలంగా ప్రేమలో ఉన్నట్టు, ముంబయి లో కాపురం పెట్టినట్టు కొంతకాలంగా మీడియా గగ్గోలు పెట్టింది. మైఖేల్‌, శ్రుతి హాసన్ తో పాటు శృతి తల్లి సారిక ఉన్న ఫొటోని మీడియా బయటపెట్టినప్పటికీ శృతి ఒప్పుకోలేదు. తామిద్దరం ప్రొఫిషనల్ ఫ్రెండ్స్ అని కాకమ్మ కథలు చెప్పింది. తండ్రి కమల్ హాసన్, తల్లి సారికను తమ పెళ్ళికి ఒప్పించే పనిలో ఉన్నారని కథనాలు ప్రచురించినా శృతి హాసన్.. అలాంటిది ఏమిలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. తాజాగా మరో సారి దొరికిపోయింది. మైఖేల్‌ రీసెంట్ గా లండన్ వెళ్ళాడు.

అతని ఎడబాటుని తట్టుకోలేని శృతి ట్విట్టర్ వేదికపై తన బాధని కవిత్వ రూపంలో బయటపెట్టింది. ”ఎవరైతే మన పక్కన ఉండాలని మనం ఎక్కువగా కోరుకుంటామో.. అలాంటి వారికి ఎయిర్ పోర్టులో గుడ్ బై చెప్పడమనేది నిజంగా భరించలేని ఫీలింగ్” అంటూ శ్రుతి ట్వీట్ చేసింది. మైఖేల్‌ కూడా ఏమి తగ్గలేదు. “ప్రతిసారి బాధపడుతూనే విడిచిపెట్టి వెళుతున్నా” అంటూ బ్రోకెన్ హార్ట్ ఎమోజీతో సహా ట్వీట్ చేశాడు. దీంతో ఇద్దరూ పీకల్లోతు ప్రేమలో ఉన్నారని సోషల్ మీడియా వేదిక సాక్షిగా స్పష్టమయింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus