ఇంకేం ఇంకేం కావలే (గీత గోవిందం) నుండి లేటెస్ట్ శ్రీవల్లి (పుష్ప) పాట వరకు, సిద్ శ్రీరామ్ లిస్టులో చాలా బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి. అమెరికాలో పుట్టి పెరిగిన ఈ ఇండియన్ సింగర్ చిన్నప్పటి నుంచి సంస్కృతం, భారతీయ సంగీతానికి సంబంధించిన పాటలను బాగానే అవాపోసన పట్టేశాడు. దీంతో అతను ఏ భాషలో పాట పాడినా కూడా అక్షరాలకు బాగానే న్యాయం చేస్తున్నాడు. ఈ రోజుల్లో సిద్ శ్రీరామ్ తో ఒక పాట పాడించడం అనేది ఆనవాయితీగా మారుతోంది.
సంగీత దర్శకులకు నిర్మాత దర్శకులు అయితే అతనితో పాట పాడించాలి అని ప్రత్యేకంగా చెబుతున్నారు. ఇక సిద్ కూడా అతని పెరుగుతున్న డిమాండ్ కు తగ్గట్టుగా రెమ్యునరేషన్ కూడా గట్టిగానే పెంచేస్తున్నాడు. ప్రస్తుతం సౌత్ లో అత్యధిక రెమ్యునరేషన్ అందుకునే సింగర్స్ లో ఒకరిగా సిద్ శ్రీరామ్ క్రేజ్ అందుకుంటున్నాడు. మొన్నటివరకు 4 నుంచి 5 లక్షల వరకు డిమాండ్ చేసిన అతను ఇప్పుడు ఒక్క పాటకు 6 నుంచి 7 లక్షల వరకు అందుకుంటున్నట్లు తెలుస్తోంది.
సిద్ శ్రీరామ్ కు అడిగినంత రెమ్యునరేషన్ ఇచ్చి పాడించుకోవడం అంత ఈజీ కాదు. ఆయనకు తెలిసిన సీనియర్ మోస్ట్ టాలెంటెట్ మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర తప్పితే మిగతా వారి విషయంలో మాత్రం సిద్ అంత ఈజీగా పాడేందుకు ఒప్పుకోడట. ముందు ట్యూన్ నచ్చితేనే పాట పాడేందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తాడట. ఏఆర్ రెహమాన్ , ఇళయరాజా వంటి ప్రప్రథమ కంపోజర్స్ దగ్గర తప్పితే మిగతా మ్యూజిక్ డైరెక్టర్స్ అందరి దగ్గర ముందు ట్యూన్ విన్న తరువాతనే పాట పాడేందుకు సంతకం చేస్తున్నట్లు తెలుస్తోంది.
సిద్ శ్రీరామ్ పాట కోసం చిన్న సినిమా వాళ్ళు కూడా ప్రయత్నాలు గట్టిగానే చేస్తున్నారు. ఇక కొన్ని చిన్న సినిమాలకు సిద్ పాడిన పాటలు మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. అందుకే సిద్ ఇప్పుడు అత్యధిక రెమ్యునరేషన్ అందుకుంటున్న వారిలో ఒకరిగా క్రేజ్ అందుకుంటున్నాడు.
Most Recommended Video
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!
ఎన్టీఆర్ టు కృష్ణ.. ఈ సినీ నటులకి పుత్రశోఖం తప్పలేదు..!
20 ఏళ్ళ ‘టక్కరి దొంగ’ గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలు..!