Siddharth: సీక్రెట్ గా నిశ్చితార్థం.. ఆ కామెంట్స్ పై సిద్దార్థ్ రియాక్షన్ ఇదే!

  • April 7, 2024 / 11:01 AM IST

టాలీవుడ్ ప్రముఖ హీరోలలో ఒకరైన సిద్దార్థ్ (Siddharth) మహాసముద్రం  (Maha Samudram) సినిమాలో నటించిన సమయంలో అదితీరావు హైదరీతో (Aditi Rao Hydari) ప్రేమలో పడ్డారు. సిద్దార్థ్, అదితి కొన్నిరోజుల క్రితం రహస్యంగా నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ నిశ్చితార్థం గురించి సిద్దార్థ్ మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించగా ఆ విషయాలు తెగ వైరల్ అవుతున్నాయి. మేము సీక్రెట్ గా నిశ్చితార్థం చేసుకున్నామని చాలామంది మాట్లాడుకుంటున్నారని సిద్దార్థ్ తెలిపారు. సీక్రెట్, ప్రైవేట్ అనే పదాల మధ్య చాలా తేడా ఉందని సిద్దార్థ్ పేర్కొన్నారు.

మా నిశ్చితార్థానికి ఎవరినైతే పిలవలేదో వాళ్లు మాత్రమే ఈ ఫంక్షన్ ను సీక్రెట్ ఫంక్షన్ అని భావిస్తారని ఆయన వెల్లడించారు. ఈ ఫంక్షన్ మా ఫ్యామిలీ మెంబర్స్ మధ్య జరిగిన ప్రైవేట్ ఫంక్షన్ అని సిద్దార్థ్ కామెంట్లు చేశారు. ఫంక్షన్ డేట్ షూటింగ్ డేట్ కాదని ఆయన తెలిపారు. ఇది లైఫ్ టైమ్ డేట్ అని పెద్దల నిర్ణయం ప్రకారం జరుగుతుందని సిద్దార్థ్ పేర్కొన్నారు. పెద్దలు ఎప్పుడు ఏ సమయంలో ఏం జరగాలనుకుంటే ఆ సమయంలో అదే జరుగుతుందని ఆయన అన్నారు.

మీ ప్రపోజల్ ను అంగీకరించడానికి అదితి ఎన్నిరోజుల సమయం తీసుకున్నారనే ప్రశ్నకు సిద్దార్థ్ స్పందిస్తూ ఇలాంటి ప్రశ్నలు నన్ను అడగవద్దని ఎస్ లేదా నో అనే ఫైనల్ రిజల్ట్ మాత్రమే నాకు ముఖ్యమని సిద్దార్థ్ కామెంట్లు చేయగా ఆ కామెంట్లు తెగ వైరల్ అవుతున్నాయి. ఆమె ఎస్ చెబుతుందా లేదా అని తెగ టెన్షన్ పడ్డానని సిద్దార్థ్ అన్నారు.

అదితి అంగీకారంతో నా పేరు పాస్ లిస్ట్ లోకి చేరిందని ఆయన కామెంట్లు చేశారు. సిద్దార్థ్ త్వరలో పెళ్లికి సంబంధించిన శుభవార్త చెప్పనున్నారు. సిద్దార్థ్ పెళ్లి అయినా అధికారికంగా ప్రకటించి చేసుకుంటారో లేక రహస్యంగా చేసుకుంటారో తెలియాల్సి ఉంది. సిద్దార్థ్ అదితీరావు హైదరీలను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus