సిద్దార్ధ్ కి షాక్ ఇచ్చిన హ్యాకర్లు

పెరిగిన టెక్నాలజీ మనకి ఆనందంతో పాటు.. కొన్ని సార్లు ఆందోళనను తెచ్చిపెడుతోంది. ముఖ్యంగా హ్యాకర్లు ప్రముఖులకు అప్పుడప్పుడు చుక్కలు చూపిస్తున్నారు. సినీ స్టార్లను టార్గెట్ చేసి చెమటలు పట్టిస్తున్నారు. రీసెంట్ గా సినీ నటుడు సిద్ధార్ధ్ కి హ్యాకర్లు షాక్ ఇచ్చారు. అతని అకౌంట్ ని హ్యాక్ చేసి కంగారు పెట్టించారు. వివరాల్లోకి వెళితే.. సిద్దార్ధ్ ప్రస్తుతం టీపీ2పాయింట్0 సినిమా షూటింగ్ లో బిజీగా ఉండి తన ట్విట్టర్ అకౌంట్ ని ఓపెన్ చేయలేదు. అయితే హ్యాకర్లు సిద్దార్ధ్ అకౌంట్ ని హ్యాక్ చేసి.. అతను పోస్ట్ చేసినట్టుగా “అంత సవ్యంగానే జరిగిపోతున్నది. టీపీ2పాయింట్0 చిత్ర రిలీజ్ పోస్టర్‌ను విడుదల చేయనున్నామని చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది. సీ సముదన్ రూపొందించే క్లాసిక్” అని పోస్ట్ చేశారు. ఇది పాజిటివ్ పోస్ట్ కాబట్టి ఇది వైరల్ కాలేదు.

అంతేకాదు అనుమానం కూడా రాలేదు. తర్వాత “టీపీ2పాయింట్ 0 థియేటర్లలో మే 25, 2018లో రిలీజ్ అవుతుంది. పైరసీ వెబ్‌సైట్ తమిళ్ రాకర్స్‌లో 26 మే, 2018లో రిలీజ్ కానుంది” అని హ్యాకర్లు ట్వీట్ చేశారు. ఈరోజు (శనివారం) ఉదయమే ఈ ట్వీట్‌ను చూసిన సిద్ధార్థ్ షాక్ గురయ్యారు. వెంటనే సిద్ధార్థ్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత కొద్ది నిమిషాలకే పోలీసులు అకౌంట్ ని హ్యాకర్ల నుంచి వెనక్కి రప్పించగలిగారు. దీంతో ప్రమాదం తప్పింది. అయినా ఈ విషయం పై వివరణ ఇచ్చుకున్నారు. “సారీ. నా ట్విట్టర్ అకౌంట్ 6 నిమిషాలపాటు హ్యాకింగ్ గురైంది. నేను సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన వెంటనే వారు తగిన చర్యలు తీసుకొన్నారు. హ్యాకర్లు నా సినిమా గురించి కొన్ని అభ్యంతరకరమైన ట్వీట్లు చేశారు. నాకు ఎలాంటి సంబంధం లేదు. థ్యాంక్యూ. #TP2point0 ” అని సిద్ధార్థ్ ట్వీట్ చేశారు. దీంతో ఈ వివాదం ఇంతటితో ముగిసింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus