Siddu Jonnalagadda, Chiranjeevi: చిరు మూవీ ఆఫర్ ను అందుకే వదులుకున్నానన్న సిద్ధు.. అసలు కారణాలివే!

సిద్ధు జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda)  తన టాలెంట్ తో ఒక్కో మెట్టు ఎదుగుతూ కెరీర్ పరంగా వరుస విజయాలను సొంతం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. టిల్లూ స్క్వేర్ (Tillu Square) మూవీ సాధిస్తున్న కలెక్షన్లను చూసి ఇండస్ట్రీ వర్గాలు షాకవుతున్నాయి. ఈ సినిమాపై రూపాయి పెట్టుబడి పెట్టిన వాళ్లకు 2 రూపాయల లాభం గ్యారంటీ అని ప్రచారం జరుగుతోంది. అయితే చిరంజీవి (Chiranjeevi) మూవీ ఆఫర్ ను సిద్ధు జొన్నలగడ్డ రిజెక్ట్ చేశారని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.

టిల్లూ స్క్వేర్ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా అభిమానుల మనస్సులలో మెదులుతున్న ఎన్నో సందేహాలకు సిద్ధు జొన్నలగడ్డ చెక్ పెట్టారు. నాకు ఆల్ టైమ్ ఫేవరెట్ హీరో విక్టరీ వెంకటేశ్(Venkatesh) అని సిద్ధు అన్నారు. వెంకటేశ్ ప్రభావం నాపై చాలా ఉంటుందని ఆయన చెప్పుకొచ్చారు. చిరంజీవి, బాలయ్య(Balakrishna) , అమితాబ్ (Amitabh Bachchan) , రజనీ (Rajinikanth) ఇలా అందరితో పని చేయాలని ఉందని సిద్ధు జొన్నలగడ్డ కామెంట్లు చేశారు.

నేను చిరంజీవి గారు కలిసి ఒక సినిమా చేయాలని అయితే కొన్ని కారణాల వల్ల ఈ కాంబినేషన్ కుదరలేదని ఆయన అన్నారు. చిరంజీవి గారు సూపర్ హ్యూమన్ అని టాలీవుడ్ ఇండస్ట్రీ అంటే మొదట ఆయన పేరే గుర్తొస్తుందని సిద్ధు జొన్నలగడ్డ పేర్కొన్నారు. మా చిన్నప్పుడు చిరంజీవి, బాలయ్య ఆకాశంలో తారల్లా కనిపించేవారని అలాంటి తారలతో కలిసి నటిస్తే అది బెస్ట్ ప్రాజెక్ట్ అవ్వాలని సిద్ధు జొన్నలగడ్డ అన్నారు.

ఆ ప్రాజెక్ట్ అవుటాఫ్ వరల్డ్ ఉండాలని ఆయన తెలిపారు. నా పిల్లలకు నేను చిరంజీవి గారితో పని చేశానని గర్వంగా చెప్పుకోవాలని ఆయన పేర్కొన్నారు. దేవుడి దయ ఉంటే ఏదో ఒకరోజు నాకు ఛాన్స్ వస్తుందని ఎవరో ఒక దర్శకుడు కథ చెప్పి ఆ కథ ఆయనకు నచ్చి అంగీకరించే రోజు వస్తుందని సిద్ధు జొన్నలగడ్డ వెల్లడించారు. చిరంజీవి స్టార్ డమ్ కు తగినట్లు తీయడం సులువైన విషయం కాదని అలాంటి రోజు వస్తుందని కోరుకుంటున్నానని ఆయన కామెంట్లు చేశారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus