యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డకు (Siddu Jonnalagadda) టిల్లు (Tillu Square) సిరీస్‌తో వచ్చిన క్రేజ్.. జాక్ (Jack) సినిమాతో ఒక్కసారిగా డౌన్ అయ్యింది. బొమ్మరిల్లు భాస్కర్ (Bhaskar) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ రొమాంటిక్ యాక్షన్ డ్రామా భారీ అంచనాల మధ్య ఏప్రిల్ మొదటి వారం రిలీజ్ అయ్యింది. కానీ ప్రేక్షకుల నుంచి ఆశించిన స్పందన రాకపోవడం వల్ల సినిమా మొదటి వారం నుంచే బాక్సాఫీస్ వద్ద నష్టాలకు పడిపోయింది. తొలి వీకెండ్ కలెక్షన్స్ కూడా తక్కువగానే ఉండడంతో డిస్ట్రిబ్యూటర్లు తీవ్రంగా నష్టపోయారు.
ఈ సినిమాకు ముందుగానే బిజినెస్ చేసిన పంపిణీదారులు ఇప్పుడు నిర్మాణ సంస్థపై ఒత్తిడి పెడుతున్నారు. ముఖ్యంగా నైజాం హక్కులు సిద్ధు జొన్నలగడ్డ తన రెమ్యూనరేషన్‌లో భాగంగా తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఆ ఏరియాలో ఒక్క కోటీ వసూలు కాలేదు. దీంతో నైజాం డిస్ట్రిబ్యూటర్ ఇచ్చిన అడ్వాన్స్ మొత్తాన్ని తిరిగి ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ట్రేడ్ టాక్ ప్రకారం ఆ మొత్తం దాదాపు రూ.7 కోట్లు ఉండొచ్చని అంటున్నారు. అంటే ఇప్పుడు హీరో కూడా నష్టపోయినట్లే.
ఇక ఆంధ్రా, సీడెడ్ ప్రాంతాల్లో పరిస్థితి ఇంకాస్త ఘోరంగా ఉంది. పంపిణీదారులకు ఇప్పటికే గతంలో ఇదే సంస్థ నుంచి వచ్చిన గాండీవధారి అర్జున సినిమా వల్ల నష్టాలు వచ్చాయి. ఇప్పుడు జాక్ కూడా అట్టర్ ఫ్లాప్ కావడంతో, నిర్మాత బీవీఎస్‌ఎన్ ప్రసాద్‌పై (B. V. S. N. Prasad) తీవ్ర ఒత్తిడి వస్తోంది. గతంలోనే డిస్ట్రిబ్యూటర్లు జాక్ రిలీజ్‌కి ముందు డిస్ట్రిబ్యూటర్స్ ఇచ్చిన ఫిర్యాదుల్లో ఇదే అంశాన్ని ప్రస్తావించినట్టు వార్తలొచ్చాయి.
జాక్ సినిమాకు బడ్జెట్ కూడా గట్టిగానే ఖర్చయ్యింది. కానీ ప్రమోషన్ బలహీనత, కథలో నవ్యత లేకపోవడం, స్ర్కిప్ట్ లోని లోపాలు సినిమాను డిజాస్టర్ వైపు తీసుకెళ్లాయి. మొదటి రోజు మినహా ఆ తర్వాత కాస్తమాత్రం పాజిటివ్ వాడ్ అఫ్ మౌత్ కూడా రాలేదు. దీంతో థియేటర్లలోకి ప్రేక్షకులు రావడమే కష్టంగా మారింది.
ఇప్పుడు నిర్మాతలకు తిరిగి బిజినెస్ అమౌంట్లు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడినట్టే. ఇదంతా చూస్తుంటే సిద్ధు జొన్నలగడ్డకు టిల్లు సిరీస్‌తో వచ్చిన బ్రాండ్ విలువను జాక్ గట్టి దెబ్బతీశినట్టే. అయితే టిల్లు క్యూబ్ లాంటి ప్రాజెక్టులు లైన్‌లో ఉన్నప్పటికీ, జాక్ ఫెయిల్యూర్ కారణంగా బిజినెస్ వద్ద దృష్టి మరలిపోయే ప్రమాదం కనిపిస్తోంది. ఇలాంటివి ఇంకోసారి జరగకుండా, కంటెంట్, కమర్షియల్ పాయింట్లను సమతూకంగా ప్లాన్ చేయాల్సిన అవసరం తప్పదు.