మా మధ్య అలాంటిదేమీ లేదు : శింబు

Ad not loaded.

తమిళ హీరో శింబు కి ఈ మధ్య విజయాలు లేకపోయినా తన ప్రేమ కథల వల్ల వార్తల్లో నిలుస్తున్నాడు. గతంలో నయనతారతో పీకల్లోతు ప్రేమలో పడి.. షికార్లు చేసి చివరికి విడిపోయారు. ఆ తర్వాత హన్సికతో ప్రేమాయణం నడిపించాడు. హన్సిక శింబు సంగతిని తొందరగా తెలుసుకొని దూరమయింది. తాజాగా కోలీవుడ్ జనాలు పాత ప్రేమకథను బయటికి లాగారు. త్రిష, శింబు మళ్ళీ ప్రేమించుకుంటున్నారని సోషల్ మీడియాలో వార్తలు గుప్పిస్తున్నారు. కెరియర్ మొదట్లో శింబు,త్రిషతో కలిసి రెండు సినిమాల్లో నటించాడు. ఆ సమయంలోనే వాళ్లిద్దరూ ప్రేమలో పడినట్టుగా జోరుగా ప్రచారం జరిగింది.

ఆ తర్వాత కొత్త హీరోయిన్స్ రావడంతో ఆ ప్రేమ కథ మరుగునపడిపోయింది. వీరి కాంబినేషన్లో వచ్చిన ‘విన్నైతాండి వరువాయా’  సినిమాకి సీక్వెల్ చేయడానికి ఇప్పుడు సన్నాహాలు జరుగుతున్నాయి. అందుకే త్రిష, శింబు ప్రేమాయణం గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. ఈ వార్తలపై శింబు స్పందించాడు. అప్పట్లో తనకీ, త్రిషకి మధ్య ప్రేమాయణం కొనసాగిందంటూ జరిగిన ప్రచారంలో వాస్తవం లేదన్నాడు. తనకి త్రిష చిన్నప్పటి నుంచీ తెలుసనీ .. ఆమెతో తనకి స్నేహం మాత్రమే ఉందని స్పష్టం చేశాడు.  ఆ స్నేహంతో సీక్వెల్ లో అవకాశం ఇస్తాడో, లేదో అనేది మాత్రం చెప్పలేదు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus