Singeetam Srinivasa Rao: బాలయ్య గొప్పదనం గురించి సింగీతం అలా అన్నారా?

ప్రముఖ దర్శకులలో ఒకరైన సింగీతం శ్రీనివాసరావు డైరెక్షన్ లో తెరకెక్కిన ఎన్నో సినిమాలు బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాలను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. సింగీతం శ్రీనివాసరావు మాట్లాడుతూ వయస్సు అలాగే ఉండేందుకు అమృతం తాగారా అని చాలామంది అడుగుతున్నారని ఏమిటో ఈ బహుమతి అంటూ చెప్పుకొచ్చారు. మెంటల్ గా నా వయస్సు 25 సంవత్సరాలు మాత్రమేనని ఆయన తెలిపారు. మాయాబజార్ నా తొలి సినిమా అని ఆ సినిమాకు అప్రెంటీస్ అసిస్టెంట్ గా పని చేశానని ఆయన అన్నారు.

రామారావు గారిని కృష్ణుడి గెటప్ లో చూసిన వెంటనే ఎలా ఉందో చెప్పలేని అనుభూతి కలిగిందని అదో అద్భుతమని ఆయన చెప్పుకొచ్చారు. నేను సైన్స్ స్టూడెంట్ నని ఎన్నో పరిశోధనలు చేసేవాళ్లమని సింగీతం శ్రీనివాసరావు చెప్పుకొచ్చారు. శ్రీ కృష్ణదేవరాయలు పాత్రకు బాలయ్య బాగుంటారని ఆదిత్య 369 సినిమాకు ఆయనను ఎంచుకున్నామని సింగీతం తెలిపారు. ఆదిత్య 369 సీక్వెల్ ఆదిత్య 999 కథ సిద్ధంగా ఉందని బాలయ్య ఎప్పుడు వస్తే అప్పుడు చేస్తామని సింగీతం చెప్పుకొచ్చారు.

భైరవద్వీపంలో కురూపి రోల్ చేయడం వల్లే బాలయ్యకు పేరొచ్చిందని సింగీతం అన్నారు. ప్రాజెక్ట్ కె సినిమాకు స్క్రిప్ట్ వరకు మాత్రమే మార్పులు చేర్పులు చేసి ఇచ్చానని సింగీతం శ్రీనివాసరావు అన్నారు. ఒకరోజు బాలకృష్ణ గారికి లైటింగ్ ఆలస్యం అవుతుందని మధ్యాహ్నం 12 గంటలకు షూటింగ్ కు రావాలని చెప్పామని సింగీతం శ్రీనివారావు అన్నారు.

ఆ విషయం బాలయ్య సీనియర్ ఎన్టీఆర్ తో చెప్పగా ఒకవేళ లైటింగ్ ముందుగానే ఓకే అయితే నీ ద్వారా షూటింగ్ లేట్ కాకూడదని ఎన్టీఆర్ చెప్పడంతో బాలకృష్ణ ముందుగానే షూటింగ్ కు వచ్చారని సింగీతం శ్రీనివాసరావు కామెంట్లు చేశారు. సీనియర్ ఎన్టీఆర్ నుంచి బాలయ్యకు క్రమశిక్షణ వచ్చిందని సింగీతం శ్రీనివాసరావు వెల్లడించారు. బాలయ్య గొప్పదనం గురించి సింగీతం వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

బిగ్ బాస్ 6 తెలుగు 21 మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus