కోలీవుడ్ తో పాటు టాలీవుడ్లో కూడా స్టార్ సింగర్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా రాణించారు చిన్మయి.క్యాస్టింగ్ కౌచ్, మీటూ ఉద్యమంలో ఈమె కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. సౌత్ లో ‘మీటూ’ ఉద్యమం నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళడానికి ఈమెనే కారణమని చెప్పాలి. వైరముత్తు వంటి స్టార్ రైటర్ ను కూడా ఏకిపారేసింది చిన్మయి.ఈ క్రమంలో ఆమెకు అవకాశాలు తగ్గినప్పటికీ వెనకడుగు వేయలేదు. ఆ తరువాత నుండీ కూడా చిన్మయి ఆడవాళ్ళ సమస్యల పై పోరాడుతూనే ఉంది. కాగా ఇటీవల ఓ నెటిజన్ కూడా చిన్మయి చేస్తున్న మంచి పని గురించి ఆనందం వ్యక్తం చేస్తూ అదే టైములో తాను ఎదుర్కొన్న చేదు అనుభవాలను కూడా వివరించింది.
ఆ నెటిజెన్ మాట్లాడుతూ.. ‘మీరు చాలా మందికి ఇన్స్పిరేషన్ గా నిలిచారు మేడం. నేను కూడా నా చిన్నప్పటి నుండీ చాలా వేధింపులు ఎదుర్కొన్నాను.నా కజిన్ నాపై అత్యాచారం చేస్తూ వచ్చాడు. దీని గురించి చెప్పాలంటే భయమేసేది. అయినా సరే ఓసారి తెగేసి చెప్పేసాను. అయితే అప్పుడు మా అమ్మ నాన్నలు ‘ఈ విషయం గురించి బయట చెప్పకు’ అని నా నోరు మూయించారు.అప్పుడు నాకు చాలా బాధేసింది. మీరు ఇలాంటి వాటిపై ధైర్యంగా పోరాడడం చూసి నాకు కూడా ధైర్యం వచ్చింది. ‘కొంత మంది పురుషులు తప్పు చేసినా.. ఎందుకు చూస్తూ ఊరుకోవాలి?’ అనే ఆలోచన నాకు వచ్చింది. ఇంట్లో ఎదిరించ లేకపోయాను.. బయట ఎందుకు తగ్గాలి అనిపించింది.
అందుకే ఓ ఆకతాయి నన్ను తాకి అల్లరి చేస్తే.. అతని పై కంప్లైంట్ ఇచ్చి.. శిక్ష పడేలా చేశాను. మా లాంటి వాళ్ళలో ధైర్యం నింపుతున్నందుకు థాంక్స్” అంటూ ఆమె చెప్పుకొచ్చింది . వీటికి చిన్మయి స్పందిస్తూ.. “సొసైటీ లో చాలా మంది దుర్మార్గులు ఉన్నారు. వాళ్ళు అమ్మాయిలపై లైంగిక దాడి చేసినా క్షమించే వాళ్ళు కూడా ఉన్నారు.అయితే ఇది అమ్మాయిల తప్పు కాదు.నేను చెప్పదలచుకుంది ఒక్కటే.. వైరముత్తు లాంటి వాళ్ళను సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నంత కాలం మనల్ని అణగదొక్కాలని చూస్తుంటారు. వాళ్ళ తప్పులు వేలెత్తి చూపిస్తే వారికి కోపం వస్తుంది. వాళ్ళ ఇగో హర్ట్ అవుతుంది. అయినా సరే మనం ముందడుగు వెయ్యాల్సిందే” అంటూ చెప్పుకొచ్చింది.
Most Recommended Video
థ్యాంక్యూ బ్రదర్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు సాయి తేజ్.. అందరూ అలా కష్టపడినవాళ్ళే..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!