Singer Daler Mehndi: సింగర్ దలేర్ మెహందీ కి రెండేళ్ల జైలు శిక్ష!

పంజాబీ గాయకుడు దలేర్ మెహందీ ని పోలీసులు అరెస్టు చేయడం హాట్ టాపిక్ అయ్యింది. గతంలో ఇతని హ్యూమన్ ట్రాఫికింగ్ ఆరోపణలు నమోదైన సంగతి తెలిసిందే. పాటియాలా కోర్టు లో దీని పై విచారణ జరిగింది. 2 సంవత్సరాల పాటు అతనికి జైలు శిక్ష ను అమలు చేస్తూ ఆదేశాలు తీసుకుంది. 2003 లో ఇతనిపై అభియోగాలు, పిటిషన్లు దాఖలు కాగా 19 ఏళ్ల తర్వాత తీర్పు రావడం గమనార్హం.

ఈ కేసులో దలేర్‌తో పాటు అతని సోదరుడు షంషేర్ కూడా నిందితుడు కాబట్టి అతనికి కూడా శిక్ష పడింది. కానీ అతను అనారోగ్య కారణాల వల్ల మరణించిన సంగతి తెలిసిందే.అమెరికాలో ఈ బ్రదర్స్ పై 2003 ఆ టైంలో 31 కేసులు నమోదయ్యాయి.కొంతమంది చిన్నపిల్లలను, అనాథలైన పెద్ద వారిని విదేశాలకు పంపించి పెద్ద మొత్తంలో వీరు డబ్బులు వసూల్ చేసేవారని రుజువైంది. ఇక దలేర్ మెహందీ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.!

2007 లో ఎన్టీఆర్ – రాజమౌళి కాంబినేషన్ లో వచ్చిన ‘యమదొంగ’ లో ‘రబ్బరు గాజులు’, 2009 లో రామ్ చరణ్- రాజమౌళి కాంబినేషన్ ‘మగధీర’ లో ‘జోర్సే బార్సే’,2013 లో ఎన్టీఆర్- శ్రీను వైట్ల కాంబినేషన్ లో వచ్చిన ‘బాద్ షా’ లో బంతి పూల జానకి,

2017 లో బాలకృష్ణ – పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన ‘పైసా వసూల్’ లో ‘వసూలు వసూలు’, 2018 లో ఎన్టీఆర్ – త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన ‘అరవింద సమేత’ లో ‘రెడ్డి ఇక్కడ సూడు’… పాటలు పాడి తెలుగు ప్రేక్షకులను అలరించాడు.

ది వారియర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రెండో సినిమా సెంటిమెంట్ నుండి తప్పించుకోలేకపోయిన టాలెంటెడ్ డైరెక్టర్ల లిస్ట్…!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!
ఐ.ఎం.డి.బి వారి లెక్కల ప్రకారం ఈ ఏడాది ప్రధార్థంలో టాప్ 10 మూవీస్ లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus