Geetha Madhuri: ఘనంగా గీతా మాధురి సీమంతం వేడుక.. వైరల్ అవుతున్న ఫోటోలు!

గీతా మాధురి అందరికీ సుపరిచితమే. గ్రూప్ సింగర్ గా కెరీర్ ను మొదలుపెట్టిన ఈమె ఆ తర్వాత సింగర్ గా మారి చిన్న సినిమాల్లో పాటలు పాడింది. ఆ తర్వాత కాలేజీ ఈవెంట్లలో కూడా షోలు చేస్తూ పాపులర్ అయ్యింది. ఆ తర్వాత గీతా మాధురి పాడిన మాస్ పాటలు చార్ట్ బస్టర్స్ అవ్వడంతో స్టార్ స్టేటస్ ను దక్కించుకుంది. మరోపక్క ‘బిగ్ బాస్ సీజన్ 2 ‘ లో ఈమె పాల్గొని ఫ్యామిలీ ఆడియన్స్ కి దగ్గరైంది.

ఇక గీతా మాధురి 2014 లో యాక్టర్ నందుని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అతను కూడా తర్వాత హీరో అయ్యాడు కానీ అలా సక్సెస్ కాలేదు. కానీ ఇప్పటికీ పలు షోలకి హోస్ట్ గా వ్యవహరిస్తూ బాగానే సంపాదిస్తున్నాడు. నందు – గీత .. జంటకి ఫ్యాన్స్ ఉన్నారు. వీళ్ళకి ఓ పాప కూడా ఉంది. ఆమె దాక్షాయణి ప్రకృతి. ఆమె ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి.

ఇక గీతా మాధురి (Geetha Madhuri) రెండో సారి గర్భం దాల్చిన సంగతి తెలిసిందే. ఆమెకు ఇప్పుడు నెలలు నిండాయి. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులు ఆమెకు ఘనంగా సీమంతం వేడుకని నిర్వహించారు. అందుకు సంబంధించిన కొన్ని ఫోటోలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఆమె ఫాలోవర్స్ కంగ్రాట్స్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక గీతా మాధురి సీమంతం వేడుకకి సంబంధించిన ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!

‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus