ప్రేమకి, పెళ్ళికి వయసుతో సంబంధం లేదు మనసులు కలవాలి గాని..అంటూ చెప్పుకొచ్చింది ఓ ప్రముఖ ప్లే బ్యాక్ సింగర్.అందుకు సచిన్ టెండుల్కర్ నుండీ ప్రియాంక చోప్రా వరకు ఎగ్జామ్పుల్స్ చెప్పింది. విషయంలోకి వెళ్తే… సూపర్ సింగర్ ఫేమ్ మాళవిక సుందర్ వివాహం చేసుకుంది. ఎంటర్‌ప్రెన్యూర్ అయిన అశ్విన్ కశ్యప్ రఘురామన్ ను ఆమె వివాహం చేసుకుని కొత్త జీవితాన్ని మొదలుపెట్టింది.నిజానికి ఇతను మాళవిక కంటే చిన్నవాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది మాళవిక.
వీరి పెళ్లి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తమిళ్ సూపర్ సింగర్ షోలో ప్లే బ్యాక్ సింగర్‌గా అలరించిన మాళవిక… తెలుగు, తమిళంలో చాలా సినిమాల్లో పాటలు పాడింది.ఇప్పటివరకు ఆమె ఒక్క తెలుగులోనే 200కి పైగా పాటలు పాడి ప్రేక్షకుల్ని అలరించింది.ఇక ఎంతో కాలంగా అశ్విన్ కశ్యప్ రఘురామన్ తో ప్రేమలో ఉన్న మాళవిక.. చాలా సందర్భాల్లో ఈ విషయం పై ప్రశ్నలు ఎదురైనా.. దాని పై క్లారిటీ ఇవ్వలేదు.
అది తన వ్యక్తిగతమని లేక కాలమే నిర్ణయిచాలంటూ మాట దాటేసేది. అయితే ఇంత ప్రైవేట్ గా ఆమె పెళ్ళి చేసుకోవడంతో అంతా ఆశ్చర్యపోయారనే చెప్పాలి. ‘వయసుతో సంబంధం లేకుండా ఒకరి అభిప్రాయాలు ఒకరు గౌరవించుకుంటే చాలు’ అంటూ మెసేజ్ లు కూడా ఇస్తుంది ఈ అమ్మడు.
Most Recommended Video
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!