Mangli: బావతో నా పెళ్ళా.. నాక్కూడా తెలియదే: మంగ్లీ

సోషల్ మీడియా ఎంతో అభివృద్ధి చెందిన తర్వాత సెలబ్రిటీలకు సంబంధించి ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంటాయి. అయితే వాటిలో కొంతవరకు నిజం ఉన్నప్పటికీ మరికొన్ని మాత్రం అవాస్తవాలు అయి ఉంటాయి. ఈ క్రమంలోనే ప్రతి ఒక్క సెలబ్రిటీ గురించి ఇలా ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో వస్తున్నటువంటి తరుణంలో ఆ వార్తలను సెలెబ్రిటీలు ఖండిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ప్రముఖ సింగర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి మంగ్లీ గురించి కూడా గత రెండు రోజులుగా ఒక వార్త సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది.

ఈమె త్వరలోనే పెళ్లి చేసుకోబోతుంది అంటూ వార్త వైరల్ గా మారింది. ఇంట్లో వారి ఒత్తిడి చేస్తున్నటువంటి నేపథ్యంలో మంగ్లీ వివాహానికి సిద్ధమైందని త్వరలోనే ఈమె పెళ్లి చేసుకోబోతుందని వార్తలు వచ్చాయి. మంగ్లీ పెళ్లి చేసుకోబోయే అబ్బాయి గురించి కూడా వార్తలు చక్కర్లు కొట్టాయి ఈమె సమీప బంధువు అయినటువంటి అబ్బాయిని పెళ్లి చేసుకోబోతుందని తనకు వరసకు బావ అవుతారు అంటూ కూడా వార్తలు వచ్చాయి.

అయితే ఈ వార్తలు గురించి ఎక్కడ అధికారకంగా ప్రకటన లేకపోయినా (Mangli) మంగ్లీ పెళ్లి వార్తలు మాత్రం వైరల్ అవుతున్నాయి. దీంతో ఈ పెళ్లి వార్తలపై మంగ్లీ స్పందించి అసలు విషయం బయట పెట్టారు. ఈ సందర్భంగా మంగ్లీ పెండ్లి వార్తలపై స్పందిస్తూ నా పెళ్లి మా బావతో జరుగుతుందా నాకు తెలియని బావ ఎక్కడినుంచి వచ్చారో నాకైతే అర్థం కావడం లేదు. నాకు తెలియకుండానే నా పెళ్లి చేసేస్తున్నారు.

అసలు ఇలాంటి వార్తలను ఎట్ల సృష్టిస్తున్నారో కాస్త చెప్పండి అంటూ ఈ సందర్భంగా ఈమె పెళ్లి వార్తలపై తన స్టైల్ లో సెటైర్స్ వేస్తూ చేస్తున్నటువంటి ఈ కామెంట్స్ బట్టి చూస్తుంటే పెళ్లి వార్తలు కేవలం ఆ వాస్తవమేనని ఇందులో నిజం లేదని తెలిసిపోయింది. పెళ్లి వార్తలపై మంగ్లీ స్పందించడంతో ఈ వార్తలకు పులిస్టాప్ పడింది.

స్కంద సినిమా రివ్యూ & రేటింగ్!

చంద్రముఖి 2 సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రిన్స్ యవార్ గురించి 10 ఆసక్తికర విషయాలు !

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus