మరో వివాదంలో ప్రముఖ టాలీవుడ్ సింగర్‌.!

సింగర్ రాహుల్ సిప్లిగంజ్ మరో వివాదంతో వార్తల్లో నిలిచాడు. ఇటీవల RRR సినిమాలో నాటు నాటు సాంగ్ పాడి మంచి క్రేజ్ అందుకున్న రాహుల్ సిప్లిగంజ్‌ ను టాస్క్ పోర్స్ అధికారులు అదుపులోకి తీసుకోవడం హాట్ టాపిక్ గా నిలిచింది. రాహుల్ తో పాటు మరికొందరు అధికారుల ముందు ఆందోళనకు దిగడంతో విషయం మీడియా వరకు వెళ్లింది. గతంలోనే పలు వివాదాలతో పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌ ఈసారి కూడా మరో వివాదంతో వార్తల్లో హాట్ టాపిక్ గా నిలిచాడు.

Click Here To Watch NOW

హైదరాబాద్ బంజారాహిల్స్​లోని ర్యాడిసన్ బ్లూ హోటల్​ పై అకస్మాత్తుగా టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. అయితే ఫుడింగ్ మింగ్ పబ్ సమయానికి మించి నడుపుతున్నట్లు అధికారులు గుర్తించారు. వెంటనే యజమానులతో సహా మరో 150 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వెంటనే వారందరినీ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. సోషల్ మీడియాలో కూడా రాహుల్ ను అరెస్ట్ చేసినట్లు అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి.

12 గంటల వరకు ఉండాల్సిన పబ్ ను సమయానికి మించి నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్నట్లు పోలీసులకు సమాచారం అందడంతో ఆదివారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో పబ్​పై దాడులు నిర్వహించారు. ఇక పట్టుబడిన యువకులను అలాగే మరికొంత మంది నిర్వాహకులను పోలీస్‌ స్టేషన్‌కు తరలించగా ఒక్కసారిగా గందరగోళం ఏర్పడింది. ఇక స్టేషన్‌లో అందరూ కూడా హంగామా సృష్టించారు. పబ్ సిబ్బందితో పాటు కస్టమర్లను ఎందుకు స్టేషన్‌కు తీసుకువచ్చారంరని వంద మందికి పైగా ఆందోళనకు దిగారు.

ఇక అందులో టాలీవుడ్ ప్రముఖ సింగర్ సింగర్ రాహుల్‌ సిప్లిగంజ్‌ కూడా ఉండడంతో ఈ వివాదం మీడియాలో కూడా హాట్ టాపిక్ గా మారింది. అలాగే పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో మరికొందరి బడా సెలబ్రెటీల కుమారులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ విషయంపై రాహుల్ ఇంకా ఎలాంటి వివరణ అయితే ఇవ్వలేదు.

ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus