హైదరాబాదులోని రాడిసన్ బ్లూ హోటల్ లో టాస్క్ ఫోర్స్ అధికారులు నిర్వహించిన దాడులలో డ్రగ్స్ కోణం కూడా బయటపడడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. అసలైతే సమయానికి మించి అనధికారికంగా పంబ్ నడుపుతున్నట్లు పోలీసులకు సమాచారం అందుకుని సీక్రెట్ గా దాడులు నిర్వహించారు. అయితే ఆకస్మిక దాడులలో డ్రగ్స్ కోణం కూడా బయటకు వచ్చింది. కొందరు డ్రగ్స్ వాడినట్లుగా తెలుస్తోంది. ఇక యాజమాన్యంతో పాటు అలాగే పార్టీలో పాల్గొన్న వారిని కూడా పోలీసులు అదుపులోకి తీసు కోవాల్సి వచ్చింది.
అయితే అందులో కొంత మంది సినీ సెలబ్రిటీలు అలాగే మరికొంతమంది రాజకీయ సినీ ప్రముఖుల పిల్లలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ వ్యవహారంలో సింగర్ రాహుల్ సిప్లిగంజ్ కూడా ఉన్నట్లుగా కథనాలు వెలువడిన విషయం తెలిసిందే. అయితే ఆ విషయం ఉదయం నుంచి వైరల్ అవుతుండగా రాహుల్ సిప్లిగంజ్ వెంటనే క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు.అక్కడ పార్టీ ఉంటేనే నేను వెళ్లాల్సి వచ్చింది.. సమయానికి మించి నిబంధనలకు విరుద్ధంగా పబ్ ను నడిపిన యాజమాన్యంపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
కానీ అడ్డంగా దొరికినట్లుగా నాపై తప్పుడు వార్తలు రాస్తున్నారు. డ్రగ్స్ తీసుకునే అలవాటు నాకు లేదు. నేను ఏ టెస్ట్ కైనా సిద్ధంగా ఉంటాను. డ్రగ్స్ నివారణపై అవగాహన కల్పించే కార్యక్రమాల్లో కూడా నేను పాల్గొన్నాను. అలాంటిది నేను ఇలా ఎందుకు చేస్తాను.. అని రాహుల్ తనదైన శైలిలో వివరణ ఇచ్చాడు. నిజానిజాలు తెలుసుకోకుండా ఇలాంటి తప్పుడు వార్తలు రాయవద్దని.. ఆ కేసులో తనకు ఎలాంటి సంబంధం లేదని కూడా రాహుల్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు.
ఈ కేసుకు సంబంధించిన అనేక విషయాలు ఇంకా బయటకు రావాల్సి ఉంది. టాస్క్ ఫోర్స్ అధికారులు కొంతమంది డ్రగ్స్ తీసుకున్నట్లు గుర్తించడం జరిగింది. ఇక అనుమానం ఉన్నవారిపై టెస్టులు చేసినట్లు తెలుస్తోంది. దాదాపు 150 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కొంతమందికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించేశారు. నాగబాబు కూతురు నిహారిక ను కూడా అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఆమెను ఉదయమే విడిచి పెట్టడం జరిగింది. నిహారిక ఎలాంటి తప్పు చేయలేదని నాగబాబు కూడా వివరణ ఇచ్చారు.
Most Recommended Video
‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?