Revanth: పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన రేవంత్ భార్య అన్విత!

టాలీవుడ్ ఇండస్ట్రీలో సింగర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రేవంత్ ఎన్నో అద్భుతమైన పాటలను పాడి ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇలా సింగర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రేవంత్ బిగ్ బాస్ సీజన్ 6 కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొన్నారు.ఇలా కంటెస్టెంట్ గా వెళ్లినటువంటి రేవంత్ మొదటి నుంచి తన ఆటతీరుతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. ఇక మొదటివారం నుంచి టైటిల్ రేస్ లో ఉన్నటువంటి రేవంత్ తప్పనిసరిగా టైటిల్ విన్నర్ అవుతారంటూ ఇప్పటికే సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

ఇకపోతే ఇప్పటికే ఎంతోమంది మాజీ కంటెస్టెంట్లు కూడా రేవంత్ విన్నర్ అంటూ చెప్పేస్తున్నారు.ఇకపోతే రేవంత్ బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చేముందు తన భార్య అన్విత ప్రెగ్నెంట్ అనే సంగతి మనకు తెలిసిందే. ఈయన బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చే సమయంలో కూడా అన్విత వేదిక పైకి వచ్చారు.ఇక రేవంత్ ఇంట్లో ఉన్న సమయంలోనే ఆమె సీమంతపు వేడుకలను కూడా ఎంతో ఘనంగా నిర్వహించారు. అయితే ఈ వీడియోలన్నింటినీ కూడా బిగ్ బాస్ రేవంత్ కోసం స్పెషల్ గా చూపించారు.

ఇక ఫ్యామిలీ మెంబర్స్ వచ్చిన సమయంలో కూడా వీడియో కాల్స్ ద్వారా రేవంత్ భార్య అన్వితతో మాట్లాడారు. హౌస్ లో ఉన్నటువంటి రేవంత్ పలుమార్లు తన భార్యను తలుచుకొని ఎంతో ఎమోషనల్ అయ్యారు. అయితే అన్వితకు నెలలు పూర్తి కావడంతో నేడు ఉదయం ఈమె పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు.

ఇలా రేవంత్ తండ్రి కావడంతో అభిమానులు పెద్ద ఎత్తున సోషల్ మీడియా వేదికగా తనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ పోస్టులు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్టులు వైరల్ అవుతున్నాయి. మరి ఈ విషయాన్ని బిగ్ బాస్ రేవంత్ కి చెప్పి ఎలా సర్ప్రైజ్ చేస్తారో తెలియాల్సి ఉంది.

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus