‘ఇలాంటప్పుడు నువ్వు నా పక్కన ఉంటే బాగుండేది’ అంటూ అన్విత చేసిన పోస్ట్ వైరల్..!

సింగర్ రేవంత్.. తెలుగు ప్రేక్షకులకు పరిచయం చెయ్యనక్కర్లేని పర్సన్.. ఈ యంగ్ అండ్ టాలెంటెడ్ సింగర్ ఎన్నో సినిమాల్లో పలు సూపర్ హిట్ పాటలు పాడి ఆడియన్స్‌ని ఆకట్టుకున్నాడు. తన మధురమైన గొంతుంతో ప్రత్యేకమైన గుర్తింపుతో పాటు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా సంపాదించుకున్నాడు. ప్రస్తుతం తెలుగు బిగ్ బాస్ సీజన్ 6లో పార్టిసిపెట్ చేస్తున్నాడు రేవంత్.. రేవంతో ఈ ఏడాది ఫిబ్రవరిలో అన్వితను పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం రేవంత్ భార్య గర్భవతి.

ఇటీవలే ఆమె సీమంతం ఫంక్షన్ గ్రాండ్‌గా జరిగింది. ఆ వేడుకకు సంబంధించిన పిక్స్ నెట్టింట వైరల్ అయ్యాయి. ఈ సమయంలో ఏ మహిళ అయినా తన భర్త పక్కన ఉండాలని కోరుకుంటుంది. కానీ రేవంత్ ఇప్పుడు బిగ్ బాగ్ హౌస్‌లో ఉన్నాడు. దీంతో అన్విత ఆయణ్ణి బాగా మిస్ అవుతుంది. భర్త మీద ప్రేమతో ఆమె చేసిన ఓ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. భర్తతో కలిసున్న ఓ స్వీట్ అండ్ క్యూట్ ఫోటోని షేర్ చేస్తూ.. ‘నువ్వు లేకపోవడం వల్ల.. నా లైఫ్‌లో స్ట్రెంత్, స్మైల్, సంతోషం ఇంకా ఛార్మ్ అనేది పోయింది..

ఇలాంటి క్రూషియల్ టైంలో నేను నిన్ను చాలా మిస్ అవుతున్నాను.. ఇలాంటప్పుడు నువ్వు నా పక్కన ఉంటే బాగుండేది.. నాకు నువ్వు మాత్రమే అవసరం.. కేవలం నువ్వు మాత్రమే.. నువ్వు మాత్ర మే కావాలి.. నీకోసం ఎదురు చూస్తున్నాను’ అంటూ ఎమోషనల్ పోస్ట్ చేసింది అన్విత. అన్విత చేసిన ఈ పోస్ట్ గురించి రేవంత్ ఫ్యాన్స్, బిగ్ బాస్ ఫ్యాన్స్‌తో పాటు నెటిజన్లు కూడా రియాక్ట్ అవుతున్నారు. ‘రేవంత్ త్వరలో తిరిగొస్తాడు.

నువ్వు ధైర్యంగా ఉండు.. ఇలాంటి సమయంలో దేనికీ ఎక్కువ టెన్షన్ పడకూడదు.. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో’ అంటూ అన్వితకు జాగ్రత్తలు చెప్తున్నారు. కాగా బిగ్ బాస్ 6లో రేవంత్ వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా కొనసాగుతున్నాడు. తనకి అభిమానుల సపోర్ట్ కూడా బాగానే ఉంది. ఎలాగైనా టైటిల్ విన్ అవుతాడని రేవంత్‌ మీద హోప్స్ పెట్టుకున్నారు ఫ్యాన్స్..

ఆహ నా పెళ్లంట వెబ్ సిరీస్ రివ్యూ& రేటింగ్!
గాలోడు సినిమా రివ్యూ & రేటింగ్!

మసూద సినిమా రివ్యూ & రేటింగ్!
సూపర్ స్టార్ కృష్ణ ట్రెండ్ సెట్టర్ అనడానికి 10 కారణాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus