ఈ మధ్య కాలంలో ఎక్కడ విన్నా.. సిద్ శ్రీరామ్ పాడిన పాటలే..! ఓ సినిమా నుండీ ఫస్ట్ సింగిల్ విడుదల అవుతుంది అని తెలిస్తే ఎక్కువ శాతం అది సిద్ శ్రీరామ్ పాడిన పాటే అయ్యుంటుందని అందరూ అంచనా వేసేస్తున్నారు. నిజానికి ఆశపడుతున్నారు అనే చెప్పాలి..! అంతలా సిద్ శ్రీరామ్ పాటలకు ఆకర్షించబడుతున్నారు ప్రేక్షకులు. ఇతను పాడటం వలన ఆ పాట హిట్ అవుతుందో లేక హిట్టయ్యే పాటలనే ఇతను ఎంచుకుని మరీ పడుతున్నాడో తెలియక చాలా మంది ఆశ్చర్యపోతున్నారు.
యూట్యూబ్లో 100 మిలియన్ వ్యూస్ నమోదు చేసిన లిరికల్ సాంగ్స్ లో సిద్ శ్రీరామ్ పాడినవే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కుర్ర హీరోలు సైతం ఇతనితో ఒక పాట పాటిస్తే అది చార్ట్- బస్టర్ అయ్యి సినిమాకి హైప్ ను తీసుకొస్తుందని భావిస్తున్నారు. దర్శక నిర్మాతలు కూడా తమ సినిమాలో సిద్ శ్రీరామ్ తో ఓ పాట పాడించమని సంగీత దర్శకుల పై ఒత్తిడి తెస్తున్నారని కూడా టాక్ బలంగా వినిపిస్తుంది. మరి ఇంత డిమాండ్ ఉంది కాబట్టే.. సిద్ శ్రీరామ్ కూడా తన పారితోషికాన్ని పెంచేసాడట.
గతంలో ఒక్కో పాటకు రూ.4 లక్షల పారితోషికం అందుకుంటూ వచ్చిన సిద్ శ్రీరామ్.. ఇప్పుడు దానికి ఇంకో లక్ష పెంచి రూ.5 లక్షలు డిమాండ్ చేస్తున్నాడట. దర్శకనిర్మాతలు కూడా అందుకు ఓకే చెప్పేస్తున్నారని వినికిడి. సింగర్స్ లో సిద్ శ్రీరామ్ కే ఎక్కువ పారితోషికం అని తెలుస్తుంది. మణిరత్నం డైరెక్షన్లో తెరకెక్కిన ‘కాడల్'(తెలుగులో కడలి) చిత్రంలో ‘అడియే’ అనే పాట పాడి ప్రేక్షకులకు పరిచయమయ్యాడు సిద్. ఆ తరువాత శంకర్-విక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘ఐ’ చిత్రంలో ‘నువ్వుంటే నా జతగా’ అనే పాట పాడి దేశం మొత్తం పాపులర్ అయిపోయాడు. అప్పటి నుండీ ఇతను వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పరిస్థితి రాలేదు.
Most Recommended Video
‘పవన్ కళ్యాణ్’ హీరోగా రూపొందిన 11 రీమేక్ సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
పెళ్లయ్యి కూడా పెళ్లి కానట్టు ఉండే 10 మంది టాలీవుడ్ భామల లిస్ట్..!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!