టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ సింగర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో సునీత ఒకరు.ప్లే బ్యాక్ సింగర్ గా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి సునీత తాజాగా సర్కారు నౌకరి సినిమా చూసి ఎమోషనల్ అయ్యారు. సునీత కుమారుడు ఆకాష్ హీరోగా గంగనమోని శేఖర్ దర్శకత్వంలో జనవరి ఒకటో తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈ సినిమా ద్వారా ఆకాష్ హీరోగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు.
ఈ సినిమా ద్వారా హీరోగా పరిచయం అవ్వడమే కాకుండా తన మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.ఒక సందేశాన్ని అందరికీ చేరవేసే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇక ఈ సినిమా మంచి ఆదరణ సంపాదించుకుంది అయితే ఇటీవల ఈ సినిమా చూసినటువంటి ఈమె మీడియాతో మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు.
నిజం చెప్పాలి అంటే ఈ సినిమా విడుదలకు ముందే ఎడిటింగ్ చేసే సమయంలోనే తాను ఈ సినిమాని చూసానని తెలిపారు. అయితే ఇప్పుడు మరోసారి సినిమాని చూశానని చాలా గర్వంగా ఉంది అంటూ ఈమె తెలిపారు ఆకాష్ చాలా అద్భుతంగా నటించారు. చిన్నప్పటినుంచి సినిమాలు చేస్తాను అమ్మ అంటూ ఉంటే ఏమో అనుకున్నాను కానీ మరి ఇంత పిచ్చి ఉందని నేను అనుకోలేదు అంటూ సునీత తెలిపారు.
ఇలా తన కొడుకు గురించి మాట్లాడుతూ ఈమె ఎమోషనల్ అవడంతో సినిమా చూసి నేను కన్నీళ్లు పెట్టుకోలేదు. నా పిల్లలు కన్న కలలు నిజం అవుతుంటే తల్లిగా నాకు ఎంతో గర్వకారణంగా ఉంది. నాకు తెలియకుండానే కన్నీళ్లు వస్తున్నాయని సునీత తెలిపారు. కళ్లతో ఎక్స్ప్రెషన్ పలికించే నటులంటే చాలా ఇష్టం. నాకు సినిమాలో ఆకాశ్ కనిపించలేదు. గోపాల్ అనే పాత్ర మాత్రమే కనిపించింది. కొన్ని సినిమాలను థియేటర్లో చూస్తేనే ఆ అనుభూతి కలుగుతుంది అంటూ ఈ సందర్భంగా సునీత చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.