టాలీవుడ్ ఇండస్ట్రీలో సింగర్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో సింగర్ సునీత ఒకరు. ఈమె ఇండస్ట్రీలో సింగర్ గా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా గుర్తింపు సంపాదించుకున్నారు. ఇక ఇటీవల ఈమె కుమారుడు ఆకాశ్ సర్కారు నౌకరి సినిమా ద్వారా హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ద్వారా ఆకాష్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇది ఇలా ఉండగా తాజాగా సునీత సోషల్ మీడియా వేదిక ఒక ఎమోషనల్ పోస్ట్ చేశారు.
సునీత తన జీవితంలో రెండు వివాహాలు చేసుకున్న విషయం మనకు తెలిసిందే. ఈమె గత మూడు సంవత్సరాల క్రితం మ్యాంగో మీడియా అధినేత రామ్ వీరపనేని అనే వ్యక్తిని రెండో వివాహం చేసుకున్నారు. అయితే నేడు ఈమె వివాహ వార్షికోత్సవం కావడంతో సోషల్ మీడియా వేదికగా ఈమె ఎమోషనల్ పోస్ట్ చేశారు.
ఈమె 2021 జనవరి 9వ తేదీ కుటుంబ సభ్యులు సన్నిహితుల సమక్షంలో రెండవ వివాహం చేసుకున్నారు. ఇలా ఈమె రెండో పెళ్లి చేసుకున్న తర్వాత పూర్తిగా తన జీవితమే మారిపోయిందని వృత్తి పరమైనటువంటి జీవితంలోను వ్యక్తిగత జీవితంలోను సునీత చాలా సంతోషంగా ఉన్నారు. ఇలా ఈమె పెళ్ళికి సంబంధించినటువంటి ఫోటోని సోషల్ మీడియా వేదికగా ఈమె షేర్ చేశారు.
ఈ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసినటువంటి ఈమె నా జీవితంలో అద్భుతమైన క్షణం ఇదేనని ఆ క్షణాలు నా జీవితాన్ని మార్చేసాయి అంటూ ఎమోషనల్ పోస్ట్ చేశారు. ఈమె మొదట కూడా ప్రేమ వివాహం చేసుకున్నప్పటికీ పిల్లలు పుట్టిన తర్వాత తన భర్తతో వచ్చిన మనస్పర్ధలు కారణంగా తన భర్త నుంచి దూరంగా ఉన్నారు. అప్పటి నుంచి పిల్లల బాధ్యతలను తీసుకున్నటువంటి ఈమె (Sunitha) పిల్లల అనుమతితోనే రెండవ వివాహం చేసుకున్నారు.
ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!
ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!