గత రెండు రోజులుగా సింగర్ సునీత రెండో పెళ్ళికి రెడీ అవుతుంది, అతడే వరుడు అంటూ రకరకాల కథనాలు సోషల్ మీడియాలో, వెబ్ సైట్లలో హల్ చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. వరుడు ఎవరు అనేది పెద్ద ఇంపార్టెంట్ విషయం కాకపోయినా.. సునీత రెండో పెళ్లి టాపిక్ మాత్రం భీభత్సంగా హైలైట్ అయ్యింది. టీవీ చానల్స్ కూడా ఈ విషయమై స్పెషల్ ప్యాకేజ్స్ రన్ చేశాయంటే అర్ధం చేసుకోవచ్చు ఆ టాపిక్ ఎంత వైరల్ అయ్యింది అనేది.
అయితే.. ఇంత హడావుడి పడ్డ విషయం ఫేక్ అని స్పష్టమవుతోంది. సునీత సన్నిహిత వర్గాలను ఈ విషయమై స్పందన కోరగా.. అదేమీ లేదని, ఆ పుకార్లన్నీ ఉత్తుత్తివేనని అందుకే సునీత కూడా రెస్పాండ్ అవ్వలేదని చెప్పుకొచ్చారు. అలాగే.. సునీత తన ఇద్దరు పిల్లలతో సంతోషంగా ఉందని, అలాగే కెరీర్ పరంగా కూడా ఇప్పుడు మంచి పొజిషన్ లో ఉందని, రెండో పెళ్లి గురించి అసలు ఆమెకు ఆలోచన కూడా లేదని చెప్పుకొచ్చారు.
సునీత మాత్రం ఈ రూమర్స్ అన్ని చూసి సరదాగా నవ్వుకుంటోందట. ఇలాంటివి ఇదివరకు వచ్చినప్పుడు కాస్త చిరాకుపడేదాన్ని కానీ.. ఇప్పుడు అవన్నీ చూసి నవ్వుకుంటున్నానని సునీత చెప్పిందట. కాయలున్న చెట్టుకే రాళ్లు అన్నట్లుగా.. అందంగా ఉంది కాబట్టే సునీతకు ఇన్ని రూమర్లు. సో, సునీతకు ఇవన్నీ కామన్ అన్నమాట.