సింగర్ గా తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపుని సంపాదించుకుంది సునీత. డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా సత్తా చాటింది. ఆమె వాయిస్ కే కాకుండా.. అందానికి కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. నలభై ఏళ్ల ఈ బ్యూటీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. ఎప్పటికప్పుడు తన ఫొటోలు, వీడియోలను షేర్ చేయడంతో పాటు అప్పుడప్పుడు పాటలు కూడా పాడుతుంటారు. ఈ మధ్యకాలంలో తన రెండో పెళ్లితో తరచూ వార్తల్లో నిలుస్తుంది సునీత.
ఇటీవల రామ్ వీరపనేని అనే వ్యాపారవేత్తను రెండో పెళ్లి చేసుకున్న ఆమె ఇటు మీడియాలో, అటు సోషల్ మీడియాలో తరచూ కనిపిస్తూనే ఉంది. రీసెంట్ గా తన భర్త రామ్ ఓ వివాదంలో చిక్కుకోవడంతో సునీత కూడా హాట్ టాపిక్ అయింది. తాజాగా సునీత కుమారుడికి సంబంధించిన ఓ న్యూస్ బయటకొచ్చింది. సునీత కుమారుడు ఆకాష్ త్వరలో హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాడని సమాచారం. ఆకాష్ ను హీరోగా పరిచయం చేయడానికి సునీత భర్త రామ్ వీరపనేని గట్టి ప్రయత్నాలు చేస్తున్నారట.
ఆకాష్ తో పాటు సునీతకి శ్రేయ అనే కూతురు కూడా ఉంది. మొన్నామధ్య ఓ షోలో పాడి సింగర్ గా బుల్లితెరపై పరిచయమైంది శ్రేయ. ఇప్పుడు ఆకాష్ హీరోగా పరిచయం కాబోతున్నాడనే వార్తలు వైరల్ అవుతున్నాయి. సునీత 19 ఏళ్ల వయసులోనే కిరణ్ కుమార్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. వారికి పుట్టిన పిల్లలే ఆకాష్, శ్రేయ. ఆ తరువాత భర్తతో విబేధాలు తలెత్తడంతో అతడికి విడాకులు ఇచ్చింది సునీత. 2020లో మ్యాంగో మీడియా అధినేత రామ్ ను రెండో వివాహం చేసుకుంది సునీత.
Most Recommended Video
అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!
‘పుష్ప’లో 20కిపైగా తప్పులు… చూశారా!
అన్ని హిట్లు కొట్టినా చైతన్య స్టార్ ఇమేజ్ కు దూరం… ఆ 10 రీజన్స్ వల్లేనట..!