#Single Trailer Review: శ్రీవిష్ణు మార్క్ కామెడీతో..!

‘సామజవరగమన’ (Samajavaragamana) తో ఓ పెద్ద బ్లాక్ బస్టర్ అందుకున్న శ్రీవిష్ణు (Sree Vishnu) .. ఆ తర్వాత ‘ఓం భీమ్ బుష్’ (Om Bheem Bush) అనే లాజిక్ లెస్ కామెడీ మూవీతో డీసెంట్ హిట్ అందుకున్నాడు. అయితే తర్వాత చేసిన ‘శ్వాగ్’ (Swag) అనే ప్రయోగాత్మక సినిమా అతన్ని రేసులో వెనక్కి నెట్టినట్టు అయ్యింది. దీంతో వెంటనే తన మార్క్ కామెడీ ఎంటర్టైనర్ తో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయిపోయాడు శ్రీవిష్ణు. అదే ‘సింగిల్’ (#Single) మూవీ. ‘జి ఎ 2 పిక్చర్స్’ బ్యానర్ పై బన్నీ వాస్, విద్యా కొప్పినీడి (Koppineedi Vidya) నిర్మించారు.

#Single Trailer Review

మే 9న విడుదల కాబోతున్న ఈ సినిమా (#Single) ట్రైలర్ ను కొద్దిసేపటి క్రితం రిలీజ్ చేశారు. 2 నిమిషాల 30 నిమిషాల నిడివి కలిగిన ఈ సినిమా ట్రైలర్.. శ్రీవిష్ణు వాయిస్ ఓవర్లో స్టార్ట్ అయ్యింది. ‘అమ్మాయిలను పడేయడానికి 3 దారులు’ అంటూ చెబుతూ ఇద్దరు హీరోయిన్లు అయిన కేతిక శర్మ (Ketika Sharma), ఇవాన (Ivana)..లను పరిచయం చేశారు. పూర్వగా కేతిక శర్మ, హరిణిగా ఇవాన ఈ సినిమాలో కనిపించబోతున్నారు. ఆ ఇద్దరితో శ్రీవిష్ణు ప్రేమాయణాన్ని హిలేరియస్ ప్రజెంట్ చేయబోతున్నాడు దర్శకుడు కార్తీక్ రాజు (Caarthick Raju).

గతంలో ఇతను సందీప్ కిషన్ (Sundeep Kishan) తో ‘నిను వీడని నీడను నేనే’ (Ninu Veedani Needanu Nene) ‘నేనే నా’ (Nene Naa) వంటి సినిమాలు చేశాడు. ఇక ‘సింగిల్’ టీజర్ శ్రీవిష్ణు మార్క్ కామెడీ గట్టిగానే ఉంది. యానిమల్ సినిమాపై సెటైర్లు, బాలకృష్ణ (Nandamuri Balakrishna), మంచు విష్ణు (Manchu Vishnu)..ల ట్రోలింగ్ స్టఫ్ రిఫరెన్సులు వంటివి కనిపించాయి. అలాగే ట్రైలర్ చివర్లో ‘మగాడి జీవితం మంచు కురిసే పోవడం’ వంటి బూతులను కప్పేసే డైలాగులు కూడా ఉన్నాయి. ఇవి యూత్ కు సోషల్ మీడియా బ్యాచ్ కి ఫీస్ట్ ఇచ్చే అవకాశం ఉంది. సింగిల్ ట్రైలర్ ను మీరు కూడా ఓ లుక్కేయండి :

‘తుడరుమ్’ మేకర్స్ చేసిన మిస్టేక్ అదే!

Read Today's Latest Videos Update. Get Filmy News LIVE Updates on FilmyFocus