Siri Hanmanth: అనసూయ, రష్మీని మించి రెమ్యునరేషన్ తీసుకుంటున్న సిరి!

బుల్లితెరపై పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తున్నటువంటి కార్యక్రమాలలో బిగ్ బాస్ కార్యక్రమం ఒకటి. ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంది మంచి గుర్తింపు సంపాదించుకొని ప్రస్తుతం వెండి తెర పై ఎంతో బిజీగా ఉన్నారు.ఇలా జబర్దస్త్ కార్యక్రమం ద్వారా యాంకర్లుగా గుర్తింపు పొందినటువంటి వారిలో అనసూయ రష్మి వంటి వారు కూడా ఒకరు. ఈ కార్యక్రమానికి అనసూయ యాంకర్ గా తప్పుకోవడంతో సౌమ్యరావు వచ్చారు. ఈమె కూడా ఈ కార్యక్రమం నుంచి తప్పుకోవడంతో తన స్థానంలో బిగ్ బాస్ సిరి యాంకర్ గా వచ్చారు.

ఇలా బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి సిరి ప్రస్తుతం కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఒకవైపు సినిమా అవకాశాలు అందుకుంటున్న మరోవైపు జబర్దస్త్ కార్యక్రమానికి యాంకర్ గా కూడా అవకాశం అందుకున్నారు. ఇక ఈమె ఈ కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరిస్తున్నారని తెలియడంతో అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. ఇకపోతే సిరి తన మాట తీరుతో మొదటి ఎపిసోడ్ ద్వారా ప్రేక్షకులను మంచిగనే ఆకట్టుకున్నారు.

జబర్దస్త్ కార్యక్రమానికి యాంకర్ గా కొనసాగుతున్నటువంటి సిరి రెమ్యూనరేషన్ గురించి ప్రస్తుతం ఒక వార్త వైరల్ గా మారింది. ఇదివరకు యాంకర్లుగా పనిచేసిన వారందరికీ కూడా ఒక్కో ఎపిసోడ్ కు సుమారు రెండు లక్షలు రూపాయల రెమ్యూనరేషన్ అందించేవారు. అయితే సిరి విషయంలో మాత్రం మల్లెమాలవారు కాస్త ఎక్కువ మొత్తంలోనే రెమ్యూనరేషన్ ఇస్తున్నారని తెలుస్తోంది.

ఈమె జబర్దస్త్ కార్యక్రమానికి యాంకర్ గా కొనసాగుతున్నందుకు ఒక్క ఎపిసోడ్ కి సుమారు 3.5 లక్షల రూపాయల రెమ్యూనరేషన్ ఇచ్చారని తెలుస్తోంది. ఇలా ఒక్కో ఎపిసోడ్ కు ఈ స్థాయిలో రెమ్యూనరేషన్ తీసుకోవడం అంటే మామూలు విషయం కాదు. ఇక ఈమె రెమ్యూనరేషన్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అనసూయ రష్మిలను మించిపోయే క్రేజ్ సిరికి (Siri Hanmanth) వచ్చిందా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus