Siri Hanumanth: ‘తప్పులు అందరూ చేస్తారు.. కానీ దాన్ని ఒప్పుకోరు..’ సిరి ఎమోషనల్ కామెంట్స్ వైరల్..!

‘బిగ్ బాస్ సీజన్ 5’ లో యూట్యూబర్స్ కేటగిరిలో షణ్ముఖ్, సిరి హనుమంత్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. సిరి హనుమంత్ అమాయకత్వమో.. లేక షణ్ముఖ్ పులిహోర మహిమో ఏమో కానీ వీళ్ళ మధ్య రొమాంటిక్ ట్రాక్ సీజన్ ముగిసేవరకు సాగింది. ఏమీ లేని దానికి సిరి డల్ అవ్వడం.. షణ్ముఖ్ వచ్చి హగ్ చేసుకోవడం…అటు తర్వాత షణ్ముఖ్ అలగడం.. సిరి వచ్చి ముద్దులు పెట్టుకోవడం.. ఇలాంటి తంతు చూసి అందరికీ చిరాకు వచ్చింది.

సిరి- షణ్ముఖ్ ల పై ఎక్కువగా ట్రోలింగ్ జరగడానికి ఇదే మెయిన్ రీజన్ అని చెప్పాలి. ‘బిగ్ బాస్5’ క్లైమాక్స్ లో సిరి తల్లి కూడా హౌస్ లోకి వచ్చి ఈ విషయం పై పరోక్షంగా గట్టి వార్నింగ్ ఇచ్చింది. ఇక హౌస్ నుండి బయటకు వచ్చాక సిరి…తన ప్రియుడు శ్రీహాన్ తో విడిపోతున్నట్లు కథనాలు పుట్టుకొచ్చాయి. కానీ కొంతకాలానికి అవన్నీ రూమర్స్ అని తేలిపోయింది. అయితే ఇన్నాళ్టికి సిరి తన తప్పు తెలుసుకున్నట్టు ఉంది..

ఆ విషయంపై తాజాగా స్పందించి ఎమోషనల్ అయ్యింది. ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే సందర్భంగా ‘స్టార్ మా’ ఓ ప్రోగ్రాం ను ఏర్పాటు చేసింది. అందులో సిరి, శ్రీహాన్ కూడా పాల్గొన్నారు. ఇందులో బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు శ్రీహాన్ ను తలుచుకుంటూ తన షర్ట్ ను ముద్దు పెట్టుకునేదాన్ని అని తెలిపింది. అటు తర్వాత ‘తప్పులు అందరూ చేస్తారు..కానీ స్టేజి పై ఎవరూ దాన్ని ఒప్పుకోరు..

నేను కూడా తప్పు చేశాను’ అంటూ చెబుతూ ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. వెంటనే శ్రీహాన్ వచ్చి దగ్గరకు తీసుకుని ఓదార్చాడు. ఇందుకు సంబంధించిన ప్రోమో ఇప్పుడు వైరల్ గా మారింది. మీరు కూడా ఓ లుక్కేయండి :

రైటర్‌ పద్మభూషణ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!

మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus