Siri, Shanmukh: షణ్ముక్ ఇరిటేట్ చేస్తున్నందుకే సిరి అలా మాట్లాడిందా..?

బిగ్ బాస్ హౌస్ లో ఎంతో మంచి బాండింగ్ తో ఉన్న సిరి ఇంకా షణ్ముక్ గొడవ పడ్డారు. గత రెండు మూడు రోజులుగా ఇద్దరి మధ్యలో ఆర్గ్యూమెంట్ అనేది నడుస్తోంది. సిరిని కంట్రోల్ చేసేందుకు షణ్ముక్ చూస్తున్నాడు. అంతేకాదు, కాజల్ తో ఎక్కువగా ఎటాచ్ ఉండద్దని, నీపైన జోక్స్ వేస్తుంటే తీస్కోవద్దని, వేరేవాళ్లు హెల్ప్ చేస్తుంటే వద్దని ఇలా ఎన్నో రకాల సలహాలు ఇస్తూ వస్తున్నాడు. ఇక రోల్ ప్లే టాస్క్ లో భాగంగా వీరిద్దరి మద్యలో గొడవ పీక్స్ లోకి వెళ్లిపోయింది. ఫస్ట్ టాస్క్ లో సన్నీ షణ్ముక్ గెటప్ వేసి రెచ్చిపోయాడు.

దీంతో టాస్క్ లో నేను అలా చేయలేదంటూ సన్నీకి గట్టి వార్నింగ్ ఇచ్చాడు షణ్ముక్. ఇలా చేస్తే దాన్ని వెకిలిగా చేయడం అంటారని హితబోధ చేశాడు. మళ్లీ టాస్క్ వచ్చినపుడు సన్నీ అలాగే చేయబోతుంటే ఉన్నది ఉన్నట్లుగా చేయి, ఇదే నేను నీకు చెప్పింది అంటూ రెచ్చిపోయాడు. మీరు టాస్క్ లో అలాగే చేశారంటూ సన్నీ ఎక్స్ ప్లయిన్ చేసే ప్రయత్నం చేస్తుంటే షణ్ముక్ సీరియస్ గా వెళ్లిపోయాడు. ఇక సిరి వచ్చి షణ్ముక్ కి టాస్క్ ఆడాలి. ఇది బిగ్ బాస్ ఆదేశం అంటూ చెప్పుకుంటూ వచ్చింది. నువ్వు నాకు చెప్పద్దు టాస్క్ ఆడమని అంటూ రెచ్చిపోయాడు షణ్ముక్. నీ ప్రెండ్ కాబట్టి చెప్పాను అంటూ సిరి మాట్లాడింది.

ఇక్కడే షణ్ముక్ సిరిపై రెచ్చిపోయాడు. అవతలోడికి ఇచ్చే రెస్పెక్ట్ నాకు ఇవ్వవు నువ్వు అంటూ అరిచాడు. అందుకే కాజల్ నామీద వాగుతోంది అంటూ ఫైర్ అయ్యాడు. నువ్వే నన్ను తక్కువ చేస్తున్నావ్ అంటూ అరుస్తూ గోల చేస్తూ సిరిపై రెచ్చిపోయి మరీ మాట్లాడాడు. సిరి కూడా షణ్ముక్ మాటలకి కౌంటర్ ఇస్తూ రెచ్చగొట్టింది. ఇక రెండ్రోజులుగా షణ్ముక్ కౌన్సిలింగ్ కి బరెస్ట్ అయిన సిరి తన మనసులో ఉన్నవి బయట పెట్టేసింది. షణ్ముక్ కూడా సిరిపై అరుస్తూ గోల చేశాడు. మరి ఈ టాస్క్ లో ఏం జరిగిందో తెలియాలంటే మనం ఎపిసోడ్ వచ్చేవరకూ వెయిట్ చేయాల్సిందే. అదీ మేటర్.

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus