బిగ్ బాస్ హౌస్ లో చివరి కెప్టెన్సీ టాస్క్ అనేది జరుగుతోంది. ఇందులో భాగంగా ఇంటి సభ్యులు అందరూ టాస్క్ లో పార్టిసిపేట్ చేశారు. నియంతగా సింహాసనం పైన కూర్చున్న సభ్యుడు , ఛాలెంజ్ లో ఓడిపోయిన ఇద్దరు ఇంటి సభ్యులనుంచీ ఒకరిని సేఫ్ చేస్తూ డెసీషన్ తీస్కోవాలి. ఈ టాస్క్ లో ఫస్ట్ రౌండ్ లో చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేశారు అందరూ. మొదటి రౌండ్ లో సిరి సింహాసనంపై స్పీడ్ గా కూర్చుంది. అందుకే, సిరి తప్పించి మిగతా ఇంటి సభ్యులు టోపీ టాస్క్ లో పాల్గొన్నారు.
గార్డెన్ ఏరియాలో హుక్స్ కి వేలాడదీసిన టోపీలని చేతులతో తాకకుండా తలతో మాత్రమే తీసి, మళ్లీ వేరే చోటకి తీస్కుని వచ్చి అక్కడ వేలాడుతున్న హుక్ కి తగిలించాలి. ఈ టాస్క్ లో ముందుగా మానస్ , శ్రీరామ్ లు సేఫ్ అయ్యారు. ఆ తర్వాత కాజల్ పింకీ ఇద్దరూ కూడా స్పీడ్ గా పెట్టేశారు. ఇక షణ్ముక్, రవి, సన్నీ ముగ్గురు మాత్రమే మిగిలి ఉన్నారు. లక్కీగా షణ్ముక్ టోపీ హుక్ లో కూర్చుంది. దీంతో సన్నీ, ఇంకా రవి ఇద్దరూ టాస్క్ లో ఓడిపోయారు.
వీళ్లిద్దరిలో నుంచీ ఒకరిని సేఫ్ చేసే బాధ్యత సిరిపై పడింది. నియంతగా డెసీషన్ తీస్కోవాల్సిన టైమ్ లో మంచి డెసీషన్ తీస్కుంది సిరి. ఆల్రెడీ సన్నీకి ఇమ్యూనిటీ పాస్ ఉంది కాబట్టి, రవిని సేఫ్ చేయాలని డిసైడ్ అయినట్లుగా సన్నీకి చెప్పింది. సన్నీ ఇది ఫస్ట్ రౌండ్ కదా, లాస్ట్ కెప్టెన్సీ నాకు ఆడాలని ఉంది అంటూ రిక్వస్ట్ చేశాడు. కానీ, సిరి పట్టించుకోలేదు. తన డెసీషన్ పైన స్ట్రాంగ్ గా నిలబడింది. ఇద్దరూ కూడా నియంతకి తమ వాదనని వినిపించారు. ఇక రవిని సేఫ్ చేస్తున్నట్లుగా డెసీషన్ చెప్పేసింది సిరి.
దీంతో కాసేపు సన్నీ ఫ్రస్టేట్ అయ్యాడు. అప్సెట్ అవుతూ ఎప్పుడూ నాకే ఇలా జరుగుతుంది అంటూ అసహనాన్ని వ్యక్తం చేశాడు. బాగా హర్ట్ అయిన సన్నీ ప్రతిసారి నన్నే టార్గెట్ చేస్తారని, ఇలా మొదటి రౌండ్ లోనే వెళ్లిపోవడం అనేది బాధగా ఉందని షణ్ముక్ తో చెప్పాడు. ఫస్ట్ రౌండ్ లోనే సన్నీ అవుట్ అయిపోవడంతో మిగతా హౌస్ మేట్స్ ని ఎంకరేజ్ చేస్తూ కనిపించాడు. అంతేకాదు, అన్ని ఛాలెంజస్ లో కూడా షణ్ముక్ ని ఎంకరేజ్ చేశాడు సన్నీ.
Most Recommended Video
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!