Siri, Sunny: సన్నీతో సిరి అందుకే గొడవపడుతోందా..? సన్నీపై ఎందుకు అరిచింది..?

  • December 16, 2021 / 06:29 PM IST

బిగ్ బాస్ హౌస్ లో ఇంకా రెండు మూడు రోజులు మాత్రమే ఆట మిగిలి ఉంది. ఇందులో భాగంగా హైలెట్ టాస్క్ లని మరోసారి ఆడిస్తున్నాడు బిగ్ బాస్. సౌండ్స్ వింటూ స్లేట్స్ పైన సీక్వెన్స్ లో రాయడం, గాలి కొడుతూ బెలూన్స్ ని బ్లాస్ట్ చేయడం లాంటి టాస్క్ లు ఆడిస్తున్నాడు. ఇక్కడే శ్రీరామ్ చంద్ర ఇంకా మానస్ లు ఆడిన రోప్ వేవ్స్ టాస్క్ ని సిరి, సన్నీ, ఇంకా షణ్ముక్ లతో ఆడించాడు. అయితే, ఈటాస్క్ లో సిరి ముందుగానే చేతులు నొప్పి పుట్టి వదిలేసింది.

ఆ తర్వాత షణ్ముక్ అండ్ సన్నీ ఇద్దరూ కూడా నువ్వా నేనా అన్నట్లుగా చాలా సీరియస్ గా ఈ టాస్క్ ఆడారు. సిరి షణ్ముక్ ని ఎంకరేజ్ చేస్తూనే వేవ్స్ సరిగ్గా రావట్లేదు అంటూ సన్నీతో చెప్పింది. అయితే, అక్కడ మానస్ సంచాలక్ గా ఉన్నట్లుగా అర్ధం అవుతోంది. ఇక షణ్ముక్ కాసేపు రోప్స్ ని ఊపలేక వదిలేశాడు. దీంతో సన్నీ విన్నర్ అయ్యాడు. ఇక్కడే సిరి నువ్వు గేమ్ గెలిచావ్ కానీ, వేవ్స్ రాలేదు అంటూ మాట్లాడింది. సన్నీ నువ్వు ఓడిపోయావ్ కదా అంటూ మాట్లాడేసరికి ఓడిపోయావ్ అని అనొద్దని సీరియస్ గా చెప్పింది.

జోక్ గా మాట్లాడాను అన్నా సరే వినిపించుకోలేదు. జోక్ మచ్చా అని చెప్తున్నా, నాపై జోక్స్ మాత్రం వేయద్దు అంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. ఇక ఇద్దరూ మాటా మాటా అనుకున్నారు. ఆర్గ్యూమెంట్స్ చేస్కున్నారు. నువ్వెవరు నాకు చెప్పడానికి అంటే, మరి నువ్వెవరు నాకు చెప్పడానికి అంటూ సన్నీ రెచ్చిపోయాడు. అసలు నీకు నువ్వు ఏమైనా పెద్ద ఇది అనుకుంటున్నావా. అస్తమానం నువ్వెవరు అంటూ మాట్లాడకు అంటూ రెచ్చిపోయింది సిరి. మాటలతోనే సన్నీని రెచ్చగొట్టింది. నీకు నువ్వు ఏమనుకుంటున్నావ్ సన్నీ పెద్ద హీరోవా అంటూ రెచ్చిపోయింది.

దానికి కోపాన్ని కంట్రోల్ చేస్కుంటూ ఒక నవ్వు నవ్వాడు. దీనికి కూడా సిరి కౌంటర్ వేసింది. రీసంట్ గా వచ్చిన ఈ ప్రోమో ఇప్పుడు యూట్యూబ్ ని షేక్ చేస్తోంది. సిరి రెచ్చగొట్టడం వల్లే సన్నీ హీరో అయ్యాడు థ్యాంక్స్ సిరి అంటూ కామెంట్స్ పెడుతున్నారు సన్నీ ఫ్యాన్స్. అయితే, లాస్ట్ రెండు మూడు రోజులు ఉంది అనగా ఇలా అరవడం ఎందుకు అని కూడా చాలామంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బహుశా హౌస్ లో విన్నర్ ఎవరు అవ్వబోతున్నారు అనేది సిరికి ముందే తెలిసిపోయిందా..?

లేదా కేవలం నేను ఆర్గ్యూమెంట్ చేయడం వల్లే సన్నీ హీరో అయిపోయాడేమో అని అనుకుందా అని కామెంట్స్ చేస్తున్నారు. ఇక బిగ్ బాస్ టీమ్ నుంచీ ఏదైనా లీక్ వచ్చిందేమో ? విన్నర్ ఎవరు అవుతారో తెలిసిపోయిందేమో అని కూడా అభిప్రాయపడుతున్నారు. ఈ సీక్రెట్ సిరికి తెలిసిపోయి, షణ్ముక్ విన్నర్ అవ్వడని ఊహించి కావాలనే సన్నీని రెచ్చగొట్టిందని కూడా చెప్తున్నారు. ఏది ఏమైనా ఇంకా రెండు రోజులు ఓటింగ్ మాత్రమే మిగిలి ఉంది కాబట్టి, ఇప్పుడు సన్నీ ఫ్యాన్స్ అందరూ కూడా ఓట్ ఫర్ సన్నీ అంటూ ప్రోమో కింద కామెంట్స్ చేస్తున్నారు. అదీ మేటర్.

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!


మహేష్ టు నవీన్… ఓవర్సీస్ లో 1 మిలియన్ కొట్టిన హీరోల లిస్ట్..!
పవర్ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్ అంటే చూపించిన 11 మంది టాలీవుడ్ స్టార్లు..!
అఘోరా గెటప్‌ టాలీవుడ్‌ హీరోలకు కలిసొచ్చిందా!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus