Sita Ramam2: ‘సీతారామం 2’ ఆలోచన రెడీ.. ఇక దర్శకనిర్మాతలదే ఆలస్యం!

‘సీతారామం’.. కొన్ని నెలల క్రితం ఈ సినిమా గురించి తెగ మాట్లాడుకున్నారు జనం. కారణం ఆ సినిమా కథ, అందులోని హీరోయిన్‌ మృణాల్‌ ఠాకూర్‌ అని చెప్పొచ్చు. అందులో రాణిగా మృణాల్‌ కనిపించిన తీరు, అందం, అభినయం దానికి కారణం. ఇక సినిమా విజయం కూడా మరో కారణం. ఇటీవల అయితే మృణాల్ బీచ్‌ ఫొటోలతో చర్చల్లో నిలిచింది ఈ సినిమా. ‘మా సీత ఇలా ఉండదు’ అంటూ ఫ్యాన్స్‌ హర్ట్‌ అవుతున్నారు. అయితే సోమవారం ‘సీతారామం 2’ డిస్కషన్‌లోకి వచ్చింది. దీనికి కారణం ‘అన్నీ మంచి శకునములే’.

నందిని రెడ్డి దర్శకత్వంలో సంతోష్ శోభన్, మాళవిక నాయర్ జంటగా నటించిన చిత్రం ‘అన్నీ మంచి శకునములే’. ఈ సినిమా మే 18న విడుదల కానుంది. ఈ సినిమాలోని ఓ పాటను లాంచ్‌ ఈవెంట్‌ ఇటీవల జరిగింది. ఈ ఈవెంట్‌కు అశ్వనీదత్‌‌, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, దర్శకేంద్రడు కె రాఘవేంద్ర రావు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా అశ్వనీదత్‌ అల్లుడు, ప్రముఖ దర్శకుడు నాగ్ అశ్విన్‌ను ఉద్దేశించి రాఘవేంద్రరావు సరదా కామెంట్స్‌ చేశారు.

అశ్వనీదత్‌కు, అరవింద్‌కు ఇకపై నా లాంటి దర్శకులు అవసరం లేదు. అశ్వనీదత్‌ అల్లుణ్ని ఇంట్లో కట్టేసి పెట్టుకున్నాడు. అరవింద్ హీరోను ఇంట్లో కట్టేసి పెట్టుకున్నాడు. వీళ్లిద్దరికీ నాతో పని తీరిపోయింది. అయినా మేం ఇప్పటికీ స్నేహితులమే అంటూ రాఘవేంద్రరావు నవ్వేశారు. దీంతో సభలో కూడా అందరూ నవ్వేశారు. దీంతోపాటు ‘సీతారామం 2’ కథ గురించి టీమ్‌కి ఓ పాయింట్‌ కూడా చెప్పారు. ఇలా సినిమా తీస్తే బాగుంటుంది అని కూడా చెప్పేశారు.

‘సీతారామం 2’ (Sita Ramam2) సినిమాలో సీత పాత్ర ఏమైంది? ఆమె జీవితాన్ని సర్వనాశనం చేయటం బాధగా ఉంది. అందుకే నేను ఒక ఐడియా చెప్తాను. మీ డైరెక్టర్‌కి చెప్పు దాంతో ‘సీతారామం 2’ చేయొచ్చు. సీత రివాల్వర్ తీసుకెళ్లి విలన్‌ దగ్గరకెళ్లి కాల్చబోతే, వాడు గుహలోంచి ఎక్కడికెక్కడో తీసుకెళ్లిపోయి రామ్ చావలేదని చెప్తాడు. అప్పుడు వాళ్లిద్దరూ తప్పించుకుంటారు. ఆ తర్వాత ఫ్యామిలీ విలన్స్ ఎలా ఛేజ్ చేస్తారనే కోణంలో ‘సీతారామం 2’ చేయండి అని రాఘవేంద్రరావు చెప్పారు.

అయితే దానికి అశ్వనీదత్‌ కుమార్తె స్వప్న.. మీరు ‘జగదేక వీరుడు.. అతిలోక సుందరి’ సీక్వెల్ గురించి ఆలోచించండి అని కౌంటర్‌ ఇచ్చే ప్రయత్నం చేశారు. దీంతో అక్కడే ఉన్న అశ్వనీదత్‌ మరో కుమార్తె ప్రియాంకను పిలిచి ‘మీ ఆయన నాగ్ అశ్విన్‌తో ఆ సినిమా తీయించు’ అని రాఘవేంద్రరావు సూచించారు.

రామబాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఉగ్రం సినిమా రివ్యూ & రేటింగ్!

గుడి కట్టేంత అభిమానం.. ఏ హీరోయిన్స్ కు గుడి కట్టారో తెలుసా?
ఇంగ్లీష్ లో మాట్లాడటమే తప్పా..మరి ఇంత దారుణంగా ట్రోల్స్ చేస్తారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus