Sitara: సితార బర్త్ డే సెలబ్రేషన్స్ కి సంబంధించిన ఫోటోలు, వీడియో వైరల్!

ఈరోజు మహేష్ బాబు కూతురు పుట్టినరోజు. నేటితో సితార ఘట్టమనేని 11 వ సంవత్సరంలోకి అడుగు పెడుతుంది. దీంతో నమ్రత, మహేష్ లు తమ కూతురుకి స్పెషల్ గా బర్త్ డే విషెస్ ను తెలియజేసారు. ఇక తన 11 వ పుట్టినరోజుని సితార స్పెషల్ గా సెలబ్రేట్ చేసుకుంది. పేద విద్యార్థులకి కొత్త సైకిల్స్ ను గిఫ్ట్ గా ఇచ్చి.. వాళ్ళతోనే కలిసి పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకుంది. అందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

అలాగే దానికి సంబంధించిన వీడియోని పోస్ట్ చేస్తూ ‘నీ ఆలోచనలను, నీ ప్రేమని, నీ హృదయాన్ని నేను ప్రేమిస్తున్నాను. హ్యాపీ బర్త్ డే సితార’ అంటూ సితార తల్లి నమ్రత తన సోషల్ మీడియాలో చెప్పుకొచ్చింది నమ్రత. మరోపక్క సోషల్ మీడియాలో మహేష్ అభిమానులు కూడా సితార పాపకి స్పెషల్ గా బిర్త్ డే విషెస్ ను తెలియజేస్తున్నారు. ఏలూరులో ఉన్న మహేష్ అభిమానులు సితార పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు.

ఇక సితార (Sitara) ఇటీవల ఓ యాడ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అది ఒక నగల యాడ్. ఆ వీడియోలో సితార తన నటనతో మంచి మార్కులు వేయించుకుంది. ఆ వీడియోలో సితార నిజంగా ప్రిన్సెస్ లా కనిపించింది. తండ్రి మహేష్ కి తగ్గ కూతురు అని ప్రూవ్ చేసుకుంది. సరే ఈ విషయాలను పక్కన పెట్టేసి సితార బర్త్ డే సెలబ్రేషన్స్ స్పెషల్ పిక్స్ ను వీడియోని మీరు కూడా ఓ లుక్కేయండి :

పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

సీరియల్ హీరోయిన్స్ రెమ్యూనరేషన్ తెలిస్తే మతిపోతోంది !
ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో సందడి చేయబోతున్న 19 సినిమాలు/ సిరీస్ లు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus