కోలీవుడ్ హీరోలు రజినీకాంత్, సూర్య, కార్తీ, విజయ్, ధనుష్ ఇలా చాలా మంది హీరోలు తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. వారితో పోలిస్తే శివ కార్తికేయన్ కు తెలుగులో పెద్దగా క్రేజ్ లేదు. అయినప్పటికీ అతడితో ఓ స్ట్రెయిట్ తెలుగు సినిమా చేయడానికి రెడీ అయ్యారు దర్శకనిర్మాతలు. ఇప్పుడు ఈ సినిమా కోసం అతడికి ఏకంగా రూ.20 కోట్ల రెమ్యునరేషన్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారట.
‘జాతిరత్నాలు’ సినిమాతో టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ గా మారిన అనుదీప్ ఈ సినిమాను డైరెక్ట్ చేయబోతున్నారు. ఏషియన్ సినిమాస్ సంస్థ ఈ ప్రాజెక్ట్ ను చేపట్టనుంది. డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కనున్న ఈ సినిమాను మంచి బడ్జెట్ తో నిర్మించాలని ఫిక్స్ అయ్యారు. ఈ క్రమంలో శివ కార్తికేయన్ కు భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేశారు. ఈ కోలీవుడ్ హీరోకి తమిళనాట నలభై కోట్ల మార్కెట్ ఉందట.
అందుకే ఇరవై కోట్లు రెమ్యునరేషన్ గా ఇచ్చి మరో ఇరవై కోట్లలో సినిమా తీయాలని అనుకుంటున్నారు. నిజానికి తెలుగులో టాప్ హీరోలు మాత్రమే ఈ రేంజ్ లో రెమ్యునరేషన్ అందుకుంటారు. యంగ్ హీరోలెవరికీ రూ.10 కోట్లకు మించి ఇచ్చింది లేదు. అలాంటిది శివ కార్తికేయన్ కు రూ.20 కోట్లు ఇస్తున్నారంటే ఆశ్చర్యంగా ఉంది. మరి ఈ సినిమాతో నిర్మాతలకు ఎంత మిగులుతుందో చూడాలి!