Sivaji: భవిష్యత్ ప్రాజెక్ట్ లపై అంచనాలు పెంచిన శివాజీ.. ఆ ప్రాజెక్ట్ లో నటిస్తున్నారా?

#90’s మిడిల్ క్లాస్ బయోపిక్ (90’s – A Middle-Class Biopic) వెబ్ సిరీస్ ద్వారా శివాజీ (Sivaji) పేరు ఈ మధ్య కాలంలో మారుమ్రోగింది. ప్రస్తుతం శివాజీ వరుసగా ఆఫర్లతో కెరీర్ పరంగా బిజీ అవుతున్నారు. బిగ్ బాస్ షో సీజన్7 ద్వారా శివాజీ అభిమానులకు మరింత దగ్గరయ్యారు. తాజాగా శివాజీ తన ఇన్ స్టాగ్రామ్ లో తరుణ్ భాస్కర్ (Tharun Bhascker) తో కలిసి దిగిన ఫోటోను షేర్ చేశారు. ఆ పోస్ట్ లో సర్ప్రైజ్ కోసం రెడీగా ఉండాలని చేయబోయేది ఏంటో తెలిస్తే మీకు మాటలు కూడా రావు అంటూ క్యాప్షన్ ఇచ్చారు.

తన కామెంట్లతో శివాజీ భవిష్యత్ ప్రాజెక్ట్ లపై అంచనాలు పెంచేశారని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు శివాజీ ఒక సినిమాలో విలన్ గా నటించబోతున్నారని తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. రాబోయే రోజుల్లో శివాజీ మరిన్ని క్రేజీ ప్రాజెక్ట్ లతో ప్రేక్షకుల ముందుకు రానున్నారని సమాచారం అందుతుండటం గమనార్హం.

#90’s మిడిల్ క్లాస్ బయోపిక్ కు సీక్వెల్ కూడా తెరకెక్కనుందని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. శివాజీ సెకండ్ ఇన్నింగ్స్ లో కెరీర్ పరంగా మరింత సక్సెస్ కావాలని అభిమానులు భావిస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీని టాలెంట్ ఉన్న క్యారెక్టర్ ఆర్టిస్టుల కొరత వేధిస్తోంది. సరైన ప్రాజెక్ట్ లతో ప్రేక్షకుల ముందుకు వస్తే శివాజీకి తిరుగుండదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

బిగ్ బాస్ షో ద్వారా వారానికి 4 లక్షల రూపాయల రేంజ్ లో శివాజీకి పారితోషికం దక్కిందని సమాచారం అందుతోంది. 52 సంవత్సరాల వయస్సులో శివాజీ తన టాలెంట్ తో అభిమానులకు మరింత దగ్గరవుతున్నారు. రాబోయే రోజుల్లో శివాజీ కెరీర్ ప్లానింగ్స్ ఏ విధంగా ఉండబోతున్నాయో చూడాల్సి ఉంది. శివాజీ కామెడీ టైమింగ్ కు ఎంతోమంది అభిమానులు ఉన్నారు. శివాజీ క్రేజ్ ను అంతకంతకూ పెంచుకుంటున్నారు. శివాజీ నటుడిగా ఒక్కో మెట్టు పైకి ఎదుగుతూ ఆకట్టుకుంటున్నారు.

షరతులు వర్తిస్తాయి సినిమా రివ్యూ & రేటింగ్!

‘డెవిల్’ ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?
‘బబుల్ గమ్’ ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus