Bigg Boss 7 Telugu: మర్డర్ టాస్క్ లో ట్విస్ట్…! హంతుకులు ఎవరంటే.?

బిగ్ బాస్ హౌస్ లో మిసెస్ బిగ్ బాస్ మర్డర్ ఇన్వెస్టిగేషన్ నడుస్తోంది. ఇందులో భాగంగా పోలీస్ ఆఫీసర్స్ పాత్రలో ఉన్న అర్జున్ – అమర్ ఇద్దరూ కూడా హౌస్ మేట్స్ ని ఇంటరాగేట్ చేస్తున్నారు. ఫస్ట్ ఇంట్లో బట్లర్ అయిన ప్రియాంకని ఇన్వెస్టిగేషన్ కి తీస్కుని వెళ్లారు. దీనికోసం బిగ్ బాస్ యాక్టివిటీ ఏరియాలో ఒక వ్యాన్ తో కూడిన సెట్ వేశాడు. ఇందులో కూర్చుని మరీ హౌస్ మేట్స్ పెర్ఫామన్స్ తో రెచ్చిపోయారు. ముఖ్యంగా అమర్ – అర్జున్ పంచ్ లు వేస్తూ ఎంటర్ టైన్ చేశారు.

ప్రియాంక కూడా అద్దరగొట్టేసింది. అంతకుముందే బిగ్ బాస్ శివాజీకి సీక్రెట్ టాస్క్ ఒకటి ఇచ్చాడు. ఇంట్లో బిగ్ బాస్ మిసెస్ ని చంపింది మీరే అని, అది దొరక్కుండా మరో హత్యలు చేయాల్సి ఉంటుందని చెప్పాడు బిగ్ బాస్. దీనికోసం శివాజీకి ఒక ఫోన్ ఇచ్చాడు. అవసరమైనపుడు బిగ్ బాస్ మీకు ఫోన్ చేస్తాడని చెప్పాడు. మొదటి సీక్రెట్ టాస్క్ లో భాగంగా ప్రశాంత్ మొక్కని పోస్ట్ బాక్స్ లో పెట్టాలని చెప్పాడు బిగ్ బాస్. దీంతో ప్రశాంత్ ని తెలివిగా స్టోర్ రూమ్ లో ఉంచిన శివాజీ తర్వాత ప్రశాంత్ మొక్కని తీసుకుని పోస్ట్ బాక్స్ లో పెట్టాడు.

దీంతో ప్రశాంత్ దెయ్యంగా మారి టాస్క్ నుంచీ తప్పుకున్నాడు. ఆ తర్వాత శివాజీకి అశ్వినిని చంపే బాధ్యత ఇచ్చాడు బిగ్ బాస్. రిపోర్టర్ గా ఉన్న అశ్వినిని చాలా తెలివిగా అద్దంపై రాసి మరీ చంపాడు శివాజీ. ఈ రెండు హత్యలు చేసింది ఎవరో తెలియక ఆఫీసర్స్ తలలు పట్టుకున్నారు. అనుమానం వచ్చిన రతికని జైల్ లో పెట్టారు. ఆ తర్వాత శివాజీపైన కూడా అనుమానం వచ్చి జైల్లో ఉంచారు. దీంతో ఎంతో కష్టపడి తెలివిగా ఆడినా కూడా శివాజీ మాస్టర్ ప్లాన్ తుస్ మంది.

కంటెండర్ రేస్ నుంచీ శివాజీ కూడా తప్పుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత బిగ్ బాస్ హంతకురాలుగా ప్రియాంకని ఎంచుకున్నాడు. దీంతో ప్రియాంక చాలా తెలివిగా ఎవరికీ తెలియకుండా గౌతమ్ ని చంపింది. దీంతో గౌతమ్ కూడా దెయ్యంగా మారి కెప్టెన్సీ రేస్ నుంచీ తప్పుకున్నాడు. అలాగే ప్రియాంక యావర్ ని కూడా చంపినట్లుగా సమాచారం. ఇలా ప్రస్తుతం నలుగురు కంటెస్టెంట్స్ ఈ రేస్ నుంచీ తప్పుకున్నారు. దెయ్యాలుగా మారిన పల్లవి ప్రశాంత్, అశ్విని, గౌతమ్, ఇంకా యావర్ నలుగురు కెప్టెన్సీ రేస్ నుంచీ అవుట్ అయ్యారు.

అలాగే, సీక్రెట్ టాస్క్ లో విఫలం అయిన శివాజీ కూడా కెప్టెన్సీ రేస్ నుంచీ తప్పుకున్నట్లుగా తెలుస్తోంది. ఎంతో కష్టపడి గేమ్ ఆడిన శివాజీ జస్ట్ మిస్ అయ్యాడని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు, ఈటాస్క్ లో సీక్రెట్ టాస్క్ ఆడటం అనేది అంత ఈజీ కాదని, అయినా కూడా శివాజీ బాగా ట్రై చేశాడని చెప్తున్నారు. ప్రియాంకకి సీక్రెట్ టాస్క్ ఇచ్చి అందరికీ షాక్ ఇచ్చాడు బిగ్ బాస్. ఇక ప్రస్తుతం హౌస్ లో శివాజీ హంతకుడిగా , ముద్దాయిగా పడ్డుపడిపోయాడు. మరి ప్రియాంక ఎంతవరకూ గేమ్ (Bigg Boss 7 Telugu) ఆడుతుందనేది చూడాలి. అదీ మేటర్.

మంగళవారం సినిమా రివ్యూ & రేటింగ్!

స్పార్క్ సినిమా రివ్యూ & రేటింగ్!
సప్త సాగరాలు దాటి సైడ్ బి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus