Bigg Boss 7 Telugu: కావాలనే బిగ్ బాస్ టీమ్ ఇలా చేసిందా ? తెరవెనుక ఏం జరుగుతోందంటే.?

బిగ్ బాస్ హౌస్ లో శనివారం నాగార్జున హోస్టింగ్ అల్లాడించారు. ముఖ్యంగా హౌస్ మేట్స్ ని తన మాటల తూటాలతో ఇబ్బంది పెట్టారు. కాలికేస్తే వేలికి, వేలికేస్తే కాలికి వేసి ఇరికించారు. ఏ పాయింట్ లోను హౌస్ మేట్స్ కి వాయిస్ లేకుండా చేసి శనివారం ఎపిసోడ్ ని రక్తి కట్టించారు. ఈ ఎపిసోడ్ లోనే శివాజీ పవర్ అస్త్రాని సైతం బ్రేక్ చేసి తిరిగి శివాజీని హౌస్ మేట్ నుంచీ సాధారణ కంటెస్టెంట్ గా మార్చేశాడు. అసలు ఏం జరిగిందంటే.,
శివాజీ లాస్ట్ వీక్ జ్యూరీ మెంబర్ లో ఒకడిగా నిర్ణయాలు తీసుకునే బాధ్యతని చేపట్టాడు.

దీంతో నామినేషన్స్ నుంచీ ప్రతి టాస్క్ లోనూ ఏకాభిప్రాయం తీస్కోవాల్సి వచ్చింది. ఇక్కడే శివాజీ నిర్ణాయలతో చాలామది హౌస్ మేట్స్ విభేదించారు. ముఖ్యంగా గలాటా డ్యాన్స్ నైట్ షోలో అమర్ శివాజీని తప్పుబట్టాడు. అలాగే కిచెన్ లో కూాడ శోభాశెట్టితో శివాజీకి గొడవ అయ్యింది. ఇలా కొంతమంది హౌస్ మేట్స్ కి శివాజీ సపోర్ట్ చేస్తున్నారని స్టార్ మా బ్యాచ్ పగబట్టింది. అనుకున్నట్లుగానే శివాజీ అన్ డిసర్వ్ క్యాండెట్ అని ఓట్లు వేశారు.

ప్రియాంక, శోభాశెట్టి, టేస్టీ తేజ, రతిక, గౌతమ్ , అమర్ వారి ఓట్లతో శివాజీని అన్ డిసర్వ్ క్యాండెట్ చేసేశారు. దీంతో హోస్ట్ నాగార్జున శివాజీ పవర్ అస్త్రాని బ్రేక్ చేయమని చెప్పాడు. పవర్ అస్త్రాకి ఇచ్చిన బ్యాటరీని పూర్తిగా ఆఫ్ చేసేశారు. శివాజికి ఇచ్చిన పవర్స్ , విఐపి రూమ్ అన్నీ లాగేసుకుని సాధారణ కంటెస్టెంట్ గా మార్చారు. నిజానికి శివాజీ గలాటా టాస్క్ తర్వాత బిగ్ బాస్ కెమెరా మందు కోరుకుంది ఇదే. ఈ బాధ్యతలు నాకొద్దు నా ఆట నేను ఆడుకుంటాను. నా పవర్స్ కావాలంటే లాగేసుకో అని కూడా చెప్పాడు.

అంతేకాదు, నన్ను నామినేషన్స్ లోకి తీస్కునిరా, ఎలిమినేట్ చేసేయ్ అని కూడా అన్నాడు. ఇలా అనడం శివాజీ మొదటిసారి కాదు, గతవారం కూడా ఇలాగే అంటే హోస్ట్ నాగార్జున బ్యాటరీలో ఒక పాయింట్ కూడా తగ్గించారు. అయినా కూడా శివాజీ ఇదే పాట పాడుతుంటే బిగ్ బాస్ టీమ్ కూడా శివాజీని పంపించేద్దామని ప్లాన్ చేసిందని చాలామంది అభిప్రాయ పడుతున్నారు.

అయితే, కొంతమంది మాత్రం శివాజీకి మంచే జరిగిందని చెప్తున్నారు. స్ట్రాంగ్ గా ఇలా నామినేషన్స్ లోకి వస్తేనే విన్నర్ అవుతారని, అస్సలు గేమ్ ఆఢకుంటా ఉంటే ఆడియన్స్ కి నచ్చరని అంటున్నారు. మరి ఈ నేపథ్యంలో ఈవారం శివాజీ ఎలాంటి గేమ్ ఆడతాడు అనేది ఆసక్తికరం.

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus