ఈ హీరోయిన్లకే శివాజీరాజా వార్నింగ్ ఇచ్చారా ?

  • February 16, 2018 / 08:51 AM IST

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ‘మా’ కోసం సొంత కార్యాలయాన్ని నిర్మించాలనే సంకల్పంతో ఉన్న అధ్యక్షుడు శివాజీరాజాకి కొంతమంది హీరోయిన్స్ తీరు ఇబ్బంది కలిగించింది. ఆ విషయాన్ని మీడియా ముఖంగా కొన్ని రోజుల క్రితం తెలిపారు. “‘మా’కు సహకరించడమ్మా అంటూ హీరోయిన్లను బతిమాలుతూనే ఉన్నాం. ఇద్దరు, ముగ్గరు హీరోయిన్లు సాయం చేస్తున్నారు. మరికొందరు మేనేజర్ల మీదకి తోసేస్తున్నారు. మిమ్మల్ని డబ్బులు అడగడంలేదు. కార్యక్రమానికి వస్తే మేమే ఇస్తామంటున్నాం. కాకపోతే మీరు అడిగినంత ఇవ్వలేకపోవచ్చు. ‘మా’ అసోసియేషన్‌కు మీరు సహకరిస్తే మీ ఫొటోలను గోడలపై పెట్టుకుంటాం. మీకూ తగిన గుర్తింపు తీసుకొస్తాం. మీరు తోక జాడిస్తే మాత్రం నిర్దాక్షిణ్యంగా కత్తిరిస్తాం.

‘మా’కు సాయం చేయని మీరు మాకు అక్కర్లేదు” అని హెచ్చరించారు. ఇలా ఆగ్రహం వ్యక్తం చేయడం టాలీవుడ్ వర్గాల్లో బాగానే చర్చకు దారి తీసింది. ఆ హీరోయిన్లు ఎవరని అరా తీయగా ఇద్దరు పేర్లు స్పష్టంగా వినిపిస్తున్నాయి. వారే తమన్నా, కాజల్. బాలీవుడ్ నుంచి వచ్చి తెలుగులో టాప్ హీరోయిన్స్ గా పేరు తెచ్చుకున్నారు. వీరిని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) సిల్వర్ జూబ్లీ ఈవెంట్స్‌కి రమ్మని పిలిస్తే రెస్పాన్స్ ఇవ్వడం లేదని సమాచారం. యూఎస్‌లో జరగబోయే ఈ ఈవెంట్స్‌కు ఎక్కువగా డిమాండ్ చేస్తున్నట్లు వినికిడి. అయితే శివాజీ రాజా వర్కింగ్ తో వారిలో మార్పు వచ్చినట్లు తెలిసింది. ఈవెంట్ కి వస్తారా? రారా? అనేది ఇంకా తెలియాల్సి ఉంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus