Bigg Boss 7 Telugu: హౌస్ మేట్స్ కి పిచ్చెక్కించిన శివాజీ..! నామినేషన్స్ లో జరిగింది ఇదే..!

బిగ్ బాస్ హౌస్ లో రెండో వారం నామినేషన్స్ హీటెక్కాయి. ముఖ్యంగా శివాజీని హౌస్మేట్స్ టార్గెట్ చేస్తూ నామినేట్ చేశారు. ముఖ్యంగా ప్రియాంక శివాజీని పర్సనల్ గా టార్గెట్ చేస్తూ చాలా కారణాలు చెప్పింది. ఇసుక టాస్క్ ఆడేటపుడు మీరు ఎవరినీ ఇసుక పోస్తూ కారణాలు చెప్పనివ్వలేదని, వేరే వాళ్లని మాట్లాడనివ్వాలని క్లియర్ గా చెప్పింది. అంతేకాదు, బిగ్ బాస్ హౌస్ లో మీరు చెప్పే సామెతలు కూడా చాలా వేధిస్తున్నాయని అన్నది. దీనికి శివాజీ కౌంటర్ ఎటాక్స్ చేస్తూ పో, అంటుంటే., అగౌరవంగా మాట్లాడితే సహించేది లేదని ఖరాఖండింగా చెప్పేసింది. దీంతో ఇద్దరి మద్యలో ఆర్గ్యూమెంట్స్ పీక్స్ కి వెళ్లాయి.

శివాజీ రంగు నీళ్లు పడుతుంటే డ్యాన్స్ వేస్తూ, భారతీయుడు సినిమాలో సాంగ్ పాడు బిడ్డా అంటూ రతికని అడిగాడు. పచ్చని చిలకలు తోడుంటే పాట పాడుతూ హౌస్ మేట్స్ కి పిచ్చెక్కించాడు శివాజీ. ఆ తర్వాత నామినేట్ చేసిన శోభాశెట్టికి కూడా చుక్కలు చూపించాడు. శోభాశెట్టి కూడా మీరు ఎవ్వరినీ మాట్లాడనివ్వడం లేదని, కనీసం రీజన్ చెప్పే అవకాశం కూడా ఇవ్వట్లేదని శివాజీపై విరుచుకుపడింది. అందుకే, మిమ్మల్ని నామినేట్ చేస్తున్నా అని చెప్పింది. ఇక అమర్ దీప్ కూడా శివాజీనే నామినేట్ చేశాడు. ప్రశాంత్ మీకు తోపు కావచ్చు , కానీ ఇక్కడ ఎవరికి వారే తోపు అని చెప్పాడు. ప్రశాంత్ ఒక్కడే వేడాడటానికి వస్తే మేము పేకాడటానికి వచ్చామా అంటూ సెటైర్స్ వేశాడు.

దీంతో ఇద్దరి మద్యలో ఆర్గ్యూమెంట్స్ పెరిగాయి. అమర్ దీప్ కి శివాజీ తన ఉద్దేశ్యాన్ని చెప్పే ప్రయత్నం చేశాడు. కానీ, బెడిసికొట్టింది. ఆ తర్వాత థామినీ సైతం వచ్చి శివాజీని నామినేట్ చేసింది. దీంతో శివాజీ తన తిక్కని చూపించాడు. నేను ఇక్కడ ఎంటర్ టైన్ చేయడానికే వచ్చాను అని, బిగ్ బాస్ మాట తప్పించి ఎవ్వరి మాట వినను అంటూ క్లారిటీగా చెప్పాడు. నామినేషన్స్ లో శివాజీ కి ఐదో ఓటుగా షకీల ఓటు వేయడం కొసమెరుపు. షకీలా నీ అంత బ్రైయిన్ తో నేను గేమ్ ఆడలేను అని, నువ్వు తెలివిలో నాకంటే స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని చెప్పి ఓటు వేసింది. దీంతో శివాజీ అయోమయంలో పడ్డాడు. తర్వాత హౌస్ మేట్స్ అందరూ పల్లవి ప్రశాంత్ ని టార్గెట్ చేస్తూ మెజారిటీ ఓట్లు వేస్తుంటే శివాజీకి ఏం జరుగుతోందని అర్ధం కాలేదు.

పల్లవి ప్రశాంత్ కి ఒక్కొక్కరు ఒక్కో రీజన్ చెప్పారు. ఫేక్ గేమ్ ఆడుతున్నాడని నిరూపించే ప్రయత్నం చేశారు. అప్పుడు శివాజీకి గేమ్ అర్దం అయ్యింది. దీంతో అమర్, సందీప్, తేజ, షకీల, గౌతమ్ వీళ్లకి తన ఉద్దేశ్యాన్ని చెప్పే ప్రయత్నం చేశాడు. మరి ఈ నామినేషన్స్ ఇంకో రోజు పొడిగించాడు బిగ్ బాస్. లైవ్ స్ట్రీమింగ్ లో పూర్తి అయినా కూడా టెలికాస్ట్ లో మాత్రం పూర్తికాలేదు. మరి ఈసారి ఎవరు ఎలిమినేట్ అవుతారు ? ఎవరెవరు నామినేషన్స్ లోకి వస్తారు అనేది ఆసక్తికరం.

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus