Sivaji: బిగ్ బాస్ మాస్టర్ ప్లాన్ ఏంటి ? తెర వెనుక ఏం జరుగుతోందంటే.?

శివాజీ ఎలిమినేట్ అవ్వబోతున్నాడా.. అసలు బిగ్ బాస్ మాస్టర్ ప్లాన్ ఏంటి అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పవర్ అస్త్రాని శివాజీ కోల్పోయినప్పుడు హౌస్ మేట్స్ డెసీషన్ అన్నారు. కానీ, పవర్ అస్త్రా వచ్చినపుడు మాత్రం హౌస్ మేట్స్ కోపరేషన్ లేకుండానే సంపాదించాడు. ఇక శివాజీ గేమ్ పరంగా కూడా ఫస్ట్ నుంచీ తన స్టైల్ ని చూపిస్తున్నాడు. అంతేకాదు, ఓటింగ్ లో కూడా తన సత్తాని చాటుతున్నాడు. శివాజీ వీక్ కంటెస్టెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్లకే నా సపోర్ట్ అంటూ హౌస్ లో పెద్ద బాధ్యతని భుజాలకి వేసుకున్నాడు.

జాస్ అలూకాస్ రూమ్ లో కూర్చుని ప్రశాంత్ ని, ప్రిన్స్ ని బాగా ఎంకరేజ్ చేశాడు. ఇక్కడే ప్రిన్స్ రెండు మూడు టాస్క్ లు ఓడిపోయిన తర్వాత , బాగా ప్రస్టేట్ అయిన తర్వాత వచ్చి తన బాధని శివాజీకి చెప్పుకున్నాడు. తర్వాత పల్లవి ప్రశాంత్ అయితే ఫస్ట్ నుంచీ కూడా శివాజీతోనే ఉన్నాడు. దీంతో శివాజీ గ్రూప్ అండ్ స్టార్ మా గ్రూప్ రెండు గ్రూప్స్ అయ్యాయి. శివాజీ గేమ్ పరంగా చూస్తే తన గేమ్ తోనే ఫస్ట్ వీక్ లో అందరి చూపుని తనవైపు తిప్పుకున్నాడు.

కాఫీ లొల్లి లో గెలిచి కంటెండర్ అవ్వడం, ఆ తర్వాత ఇసుక టాస్క్ లో ఫేవరెటిజం వద్దని ఎదురు తిరగడం, ఆ తర్వాత చెవిలో అరిచే టాస్క్ గెలవడం పవర్ అస్త్రాని పొందడం ఇలా తన గ్రాఫ్ ని పెంచుకుంటూ పోయాడు. ఇక్కడ టాస్క్ పేరుతో శివాజీ పవర్ అస్త్రాన్ని దొబ్బేసి అమర్ కొంచెం డౌన్ అయిపోయాడు. ఆ తర్వాత హెల్త్ బాలేదని జాలేసి ఇచ్చేశాడు. పల్లవి ప్రశాంత్ ని, ఇంకా ప్రిన్స్ ని శివాజీ వెనకేసుకుని వస్తున్నాడని పీకల వరకూ కొంతమంది హౌస్ మేట్స్ కి కోపం ఉంది.

అయితే, దాన్ని సరిగ్గా ఎదిరించే పాయింట్స్ వాళ్ల దగ్గర లేవు. కానీ, కొన్ని విషయాల్లో శివాజీ గేమ్ రాంగ్ ట్రాక్ పోతోందనే అనిపిస్తోంది. అదేంటంటే., ఫస్ట్ వీక్ నుంచీ కూడా శివాజీ బిగ్ బాస్ షో పట్ల కొద్దిగా చులకనగానే ఉన్నాడు. కాఫీ వంకతో బిగ్ బాస్ ని తిట్టాడు. తర్వాత డ్రామా అన్నాడు జిమ్ లో ప్రోపర్టీస్ అన్నీ విసిరేశాడు. ఇలా ముందుగానే చెప్పి కొంచెం షో పట్ల తన నిరసనని వ్యక్తం చేశాడు. ఇక ఇంటికి వెళ్లిపోతా, ఎలిమినేట్ చేసేసేయ్ అని పదిసార్లు అదే మాట పదే పదే చెప్పడం వల్ల తన బ్యాటరీని కూడా కోల్పోయాడు. ఇదే చాలామంది ఆడియన్స్ ని కూడా డిస్టర్బ్ చేస్తోంది.

అంత బాగా గేమ్ ఆడుతూ ఉన్నప్పుడు ఎందుకు వెళ్లిపోతా, ఎలిమినేట్ చేసేయ్ అని మాట్లాడుతున్నాడు అని ఆడియన్స్ కి అనిపిస్తోంది. శివాజీ కరెక్ట్ గా గేమ్ ఆడితే, అందరితో వాగ్వివాదం చేస్తే చూడాలని ప్రేక్షకులు అనుకుంటున్నారు. కానీ, శివాజీ ప్రతి విషయాన్ని అక్కడిక్కడే ఆర్గ్యూమెంట్స్ లేకుండా కాంప్రమైజ్ ధోరణిలో ముగించేస్తున్నాడు. నిజానికి శివాజీ హౌస్ మేట్ నుంచీ కంటెస్టెంట్ అవ్వాలని తానే స్వయంగా కోరుకున్నాడు. కోరుకున్నట్లుగానే జరిగింది. అంతేకాదు, కొన్ని టాస్క్ లు ఆడేటపుడు కానీ, గేమ్స్ లో పార్టిసిపేట్ చేసేటపుడు కానీ, వీకెండ్ షోలో డ్యాన్స్ లు, లేదా ఏదైనా యాక్టివిటీ చేసేటపుడు కానీ మిగతా హౌస్ మేట్స్ తో మింగిల్ అవ్వట్లేదు. తను ఆ రేంజ్ లో ఆడలేకపోతున్నాడు.

ఇది ఒకరకంగా చూస్తే శివాజీ స్టేచర్ కి సరిపోయే గేమ్ కూడా కాదనేది కొందరి వాదన. ఆ ఒక్క పాియంట్ లో అతని గేమ్ ని దెబ్బతీస్తోంది. ఇక్కడ రతిక వెళ్లిపోతూ శివాజీకి మంచి మాటే చెప్పింది. అందరితో మాట్లాడండి.. అందరినీ పలకరించండి లేదంటే మీరు ఒక్క గ్రూప్ కే సపోర్ట్ చేస్తున్నారని అనుకుంటున్నారు అంది. ఇది అక్షరాల నిజం. ఎందుకంటే, శివాజీ సీనియారిటీకి కొంచెం గౌరవం ఇస్తూ ఆ స్పేస్ ఇచ్చేస్తున్నారు కొంతమంది హౌస్ మేట్స్. ఈ సీనియారిటీకి గౌరవం ఇవ్వడం వల్ల ఎదురు చెప్పలేకపోతున్నారు. ఈ ఇబ్బంది ఖచ్చితంగా ఉంది.

అందులోనూ శివాజీ (Sivaji) గేమ్ సూపర్ అని నాగార్జున అంటుంటే , హౌస్ లో ఆయన చేసే మిస్టేక్స్ పట్టడానికి టైమ్ పడుతోంది. అందుకే, అమర్, ప్రియాంక, శోభాశెట్టి ముగ్గురూ కూడా శివాజీ గేమ్ ని దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తారు. అందుకే శివాజీని ఎలిమినేట్ చేయాలని బిగ్ బాస్ టీమ్ చూస్తోందా అని అనిపిస్తోంది. ఇంత హ్యూజ్ గా ఓటింగ్ పడుతుంటే ఎలా ఎలిమినేట్ చేస్తారనే ప్రశ్న అందరిలోనూ ఉంది. అదెలాగంటే., పవర్ అస్త్రాని లాగేసుకుంటే ఖచ్చితంగా శివాజీ నామినేషన్స్ లోకి వస్తాడు. ఎందుకంటే, పార్షియాలిటీ అని మెజారిటీ ఓటింగ్ పడింది కాబట్టి తీసేసుకున్నారు.

అంటే, అందరూ నామినేట్ చేస్తారు. ఇది ఖచ్చితంగా జరిగేదే. అయితే, ఈవారం శివాజీని ఎలిమినేట్ చేసి సీక్రెట్ రూమ్ లో పెడితే ఆట మరో లెవల్ కి వెళ్తుంది. ఎందుకంటే, తర్వాత వారం కొత్త పార్టిసిపెంట్స్ వైల్డ్ కార్డ్స్ ద్వారా బిగ్ బాస్ హౌస్ లోకి రావచ్చు. అప్పుడు శివాజీ అందర్నీ అబ్జర్నవ్ చేయడానికి ఉంటుంది. అలాగే, సీరియల్ బ్యాచ్ మొత్తం వాళ్లు చేసిందే కరెక్ట్ అనే ఫీలింగ్ లోకి వెళ్తారు. శివాజీకి ఉన్న ఫేమ్, క్రేజ్ కి వీరలెవల్లో ఓట్లు కూడా వస్తాయి. ఇదే శివాజీకి ఉన్న బలం.

ఇది బిగ్ బాస్ టీమ్ కి కూడా తెలుసు. ఇప్పుడు మిగతా హౌస్ మేట్స్ పవర్ అస్త్రాలని తీసేసుకున్నా తర్వాత అందరూ నామినేషన్స్ లోకి వస్తారు. మీరు ఊహించనవి ఎన్నో జరుగుతాయ్ అని బిగ్ బాస్ టీమ్ కూడా చెప్తోంది. ఒక 6 నుంచీ 7గురు కంటెస్టెంట్స్ హౌస్ లోకి వచ్చే ఛాన్స్ ఉంది. అది కూడా ఒకేసారి వస్తే మంచి లాజిక్స్ వర్కౌట్ చేస్తారు. నెక్ట్స్ వీక్ నామినేషన్స్ లో వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చేవాళ్లు చుక్కలు చూపిస్తారు. ఇప్పుడు సీక్రెట్ రూమ్ లో శివాజీ ఉంటే ఆటలో మంచి మజా వస్తుందన్నమాట. మొత్తానికి బిగ్ బాస్ శివాజీకి భారీ స్కెట్ గీశాడు.

స్కంద సినిమా రివ్యూ & రేటింగ్!

చంద్రముఖి 2 సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రిన్స్ యవార్ గురించి 10 ఆసక్తికర విషయాలు !

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags