బిగ్ బాస్ హౌస్ లో మాటల యుద్ధం జరుగుతోంది. ఓట్ అప్పీల్ చేసుకోవడానికి బిగ్ బాస్ ఫన్ టాస్క్ లు ఇస్తే ఇంట్లో టాప్ లేచిపోయేలా ఒకరిపై ఒకరు అరుచుకుంటున్నారు. ముఖ్యంగా బాల్స్ టాస్క్ అనేది హౌస్ లో చిచ్చు రేపిందనే చెప్పాలి. ముందు శోభా యావర్ పై రెచ్చిపోయింది. యావర్ శోభాని ఛీ..తూ అంటూ రెచ్చిపోయి మరీ అరిచాడు. దీంతో అక్కడే ఉన్న శివాజీ ఇదంతా కూడా గమనిస్తునే ఉన్నాడు. ఇక మరోవైపు అమర్ దీప్ కావాలనే పల్లవి ప్రశాంత్ ని టార్గెట్ చేసి రెచ్చిపోయాడు. దీంతో ఒకరిపై ఒకరు అరుచుకున్నారు.
ఇక ఫైనల్ గా యావర్ – శోభా సంచాలక్ గా నిర్ణయం తీసుకునేటపుడు రౌండ్ కి ఒక రూల్ పెట్టద్దంటూ శివాజీ శోబాని హెచ్చరించాడు. కానీ, శోభాశెట్టి వెటకారం చేస్తూ శివాజీతో ఆర్గ్యూమెంట్ కి దిగింది. నీతో ఆర్గ్యూ చేయను అంటూనే ఇద్దరూ ఒకరిపై ఒకరు అరుచుకున్నారు. శోభా.. ఈవెటకారమే వద్దు. భవిష్యత్ లో బాధపడతావ్ అన్నట్లుగా మాట్లాడాడు శివాజీ. మీరు ఏమీ నా ఫ్యూచర్ గురించి బెంగ అక్కర్లేదండీ మా పేరెంట్స్ చూసుకుంటారంటూ శివాజీని రెచ్చగొట్టింది శోభా. దీంతో శోభా ఆడపిల్ల అని అడ్వాంటేజ్ తీస్కోవద్దు అంటూ హెచ్చరించాడు శివాజీ. అయినా సరే శోభా ఎక్కడా తగ్గేదేలే అంటూ సమాధానం చెప్పింది.
దీంతో ఇద్దరూ చాలాసేపు వాదించుకున్నారు. ఆ తర్వాత శివాజీ అయిష్టంగానే గేమ్ ఆడాడు. మద్యలో సంచాలక్ గా ఉన్న శోభాశెట్టి ప్రియాంకని ఎంకరేజ్ చేస్తుంటే ఇరిటేట్ అయ్యాడు. గేమ్ నుంచీ కావాలనే తప్పుకున్నాడు. సంచాలక్ గా అలా ఎలా మాట్లాడుతునే ఉంటావ్ అంటూ ఫ్రస్టేట్ అయిపోయాడు. ఈ టాస్క్ కంప్లీట్ అయిన తర్వాత శివాజీ శోభపైన , సీరియల్ బ్యాచ్ పైన కామెంట్స్ చేస్తునే ఉన్నాడు. శోభా గురించి – ప్రియాంక గురించి మాట్లాడుతూ బాబోయ్ ఇలాంటి ఆడపిల్లలని నేను చూడలేదని, నా కుటుంబంలో ఇలా ఉంటే నాలుగు పీకేవాడ్ని అంటూ నోరుజారాడు.
అలాగే, వీళ్లు పెళ్లిళ్లు చేసుకుని ఎలా ఉంటారో, వాళ్లు ఎలా వేగుతారో అంటూ కామెంట్స్ పాస్ చేశాడు. ఇప్పుడే కాదు, ఫస్ట్ నుంచీ కూడా శివాజీ కామెంట్స్ వదులుతూనే ఉన్నాడు. ముఖ్యంగా సీరియల్ బ్యాచ్ గురించి మాట్లాడుతునే ఉన్నాడు. అలాగే, అమర్ పల్లవి ప్రశాంత్ పై ప్రవర్తించిన విధానాన్ని కూడా తప్పుబట్టాడు. కొరికాడు, చెప్పుతీసుకుని కొడతా అన్నాడు, ముఖం పగిలిపోద్ది అన్నాడు, పిచ్చోడా అన్నాడు. అలాగే మెడికల్ రూమ్ కి తోసుకుంటూ తీస్కుని వెళ్లాడు ఇవన్నీ జనాలు చూడరా ? ఎంత బ్యాడ్ అయిపోతాడో అంటూ కామెంట్స్ చేశాడు శివాజీ.
ఆ తర్వాత కూడా మార్నింగ్ పూట సోఫాలో కూర్చుని శోభా గురించే కామెంట్ చేశాడు. ఇక యావర్ ని కూడా కౌన్సిలింగ్ చేశాడు. మీరు అనవసరంగా ఆవేశ పడుతున్నారని, లాస్ట్ వీక్ కి వచ్చిన తర్వాత వాళ్లు కావాలనే రెచ్చగొడుతున్నారంటూ మాట్లాడాడు. అలాగే, శోభాశెట్టి – ప్రియాంక వాళ్ల పని కూడా సరిగ్గా చేయడం లేదని, ఇంటి పని అందర్నీ చేయమంటూ కెప్టెన్ అమర్ కి చెప్పాడు. ఇలా అవకాశం చిక్కినప్పుడల్లా వాళ్ల గురించి మాట్లాడుతూ కామెంట్స్ చేస్తునే ఉన్నాడు. అదీ మేటర్.